ప్రభుత్వం చెట్లు పెంచమంటుంది.. చేవెళ్లలో ఫారెస్ట్ నరకమంటుంది

by Manoj |
ప్రభుత్వం చెట్లు పెంచమంటుంది.. చేవెళ్లలో ఫారెస్ట్ నరకమంటుంది
X

దిశ, చేవెళ్ల : ప్రభుత్వము చెట్లను పెంచాలి అనే సంకల్పంతో హరితహారం, నర్సరీలు అని ఎన్నో నిధులు ఖర్చు పెడుతోంది. మరోవైపు ఫారెస్ట్ అధికారులు చెట్లు నరకడానికి అనుమతి ఇస్తున్నారు. చెట్లు కొట్టే వారు ఒకటి, రెండు సర్వే నెంబర్లలో అనుమతి తీసుకుని సమీప ప్రాంతాల్లో ఉన్న చెట్లును సైతం విచ్చల విడిగా నరికేస్తున్నారు.

వివరాల్లోకి వెళితే.. నవాబుపేట్ మండలంలోని అక్నాపూర్ గ్రామంలో సోమవారం నాడు సర్వే నెంబర్ 269అ, 270అ, 277అ 1/3 సర్వే నెంబర్‌లో చెట్లు నరకడానికి అనుమతి తీసుకున్నారు. కానీ 181 సర్వేలో నరుకుతున్నారు. ఇక్కడ అనుమతి లేదు అని అడిగితే ఊరిలో ఒక దగ్గర అనుమతి తీసుకొని ఊరి సరిహద్దుల్లో ఎక్కడైనా నరుకునే అధికారం మాకుంటుంది అని సమాధానం చెబుతున్నారు. అడవులను కాపాడాలని స్థానికుల ప్రజలు ప్రాధేయ పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు తగు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

Advertisement

Next Story