కర్ణాటక హిజాబ్ వివాదంపై అమిత్ షా సంచలన వ్యాఖ్యలు!

by Web Desk |
Home Minister Amit Shah
X

న్యూఢిల్లీ: కర్ణాటక హిజాబ్ వివాదంపై విచారణ జరుగుతున్న.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్ని మతాల ప్రజలు స్కూల్ డ్రెస్ కోడ్‌ను స్వీకరించాలని ఆయన అన్నారు. అయితే అదే సమయంలో కోర్టు నిర్ణయాన్ని కూడా పాటించాలని తెలిపారు. ఈ మేరకు జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించారు.

యూపీలో జరుగుతున్న ఎన్నికలపై మాట్లాడుతూ.. ముస్లిం, యాదవ్, హిందువుల గురించి ఈ ఎన్నికలు కాదని చెప్పారు. యోగీ కూడా ఆ ఉద్దేశంతో 80-20 వ్యాఖ్యలు చేయలేదని తెలిపారు. అయితే పక్షపాతానికి అమిత్ షా కొత్త అర్థాన్ని ఇచ్చారు. రైతులు, పేదలు పక్షపాతానికి గురవుతున్నారని చెప్పారు. వారందరికీ సంక్షేమాల పథకాల రూపంలో పక్షపాతం చూపిస్తున్నామని చెప్పారు.

రాహుల్ గాంధీకి చరిత్ర తెలియకుండా మాట్లాడుతున్నారని ఆరోపించారు. 'ఆయనకు 1962లో ఏం జరిగిందో తెలియదు. నరేంద్ర మోడీ ప్రభుత్వం చైనా సవాళ్లకు గట్టిగానే బదులిచ్చింది. అంతేకాకుండా సరిహద్దు ప్రాంతాలను, సార్వభౌమత్వాన్ని కాపాడుతున్నం' అని చెప్పారు. కరోనా పరిస్థితులపై స్పందిస్తూ.. దేశంలో ఇప్పటికే మూడు వేవ్‌లను చూసిందని చెప్పారు. అయితే పరిస్థితులు చాలా వరకు మెరుగయ్యాయని అన్నారు. అయితే పౌరసత్వ సవరణ చట్టం విధానాలను రూపొందించడంలో వాయిదా మహమ్మారి వల్లేనని చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed