Hari Hara Veera Mallu: పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. పట్టాలెక్కిన వీరమల్లు

by samatah |   ( Updated:2022-04-07 07:26:26.0  )
Hari Hara Veera Mallu: పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. పట్టాలెక్కిన వీరమల్లు
X

దిశ, సినిమా :'భీమ్లా నాయక్' సక్సెస్ తర్వాత పవర్‌ స్టార్ పవన్ కళ్యాణ్ మరో యాక్షన్‌ మూవీకి సిద్ధమవుతున్నాడు. 'హరి హర వీరమల్లు' పేరుతో తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్‌కు క్రిష్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో పవన్ టైటిల్ రోల్ పోషిస్తుండగా.. యాక్షన్స్ సీన్స్ కోసం రిహార్సల్ చేస్తున్న ఆయన ఫొటోను తాజాగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.




నిధి అగర్వాల్, అర్జున్ రాంపాల్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా షూటింగ్ డిసెంబర్ 2021 నాటికే ప్రారంభం కావాల్సి ఉండగా.. ఆ సమయంలో పవన్ 'భీమ్లా నాయక్'తో బిజీగా ఉండటంతో రేపటి(శుక్రవారం) నుంచి షూటింగ్ ప్రారంభించబోతున్నారు. 17వ శతాబ్ధానికి చెందిన మొఘల్ సామ్రాజ్య నేపథ్యంలో రూపొందుతున్న చిత్రానికి ఎంఎం కీరవాణి బాణీలు అందిస్తుండగా.. జ్ఞాన శేఖర్ వీఎస్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. ఇంకా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకోని ఈ చిత్రం తెలుగు, తమిళ్, మలయాళంతో పాటు హిందీ భాషల్లో విడుదల కానుంది.






Next Story