- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Prabhas: ఇన్నేళ్లకు పెళ్లి గురించి మాట్లాడిన ప్రభాస్.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్
దిశ, వెబ్‌డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) వరుస సినిమాలతో బాక్సాఫీసును షేక్ చేసే బిజీలో పడిపోయాడు. చివరగా ప్రేక్షకుల ముందుకొచ్చిన కల్కి 2898 చిత్రం ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. బాహుబలి(Bahubali) తర్వాత రెబల్ స్టార్ బిగ్గెస్ట్ ప్రాజెక్టస్ కల్కి(Kalki) అని చెప్పుకోవచ్చు. వసూళ్ల పరంగా కూడా దూసుకుపోయింది. నెక్ట్స్ రాజాసాబ్(Rajasab), స్పిరిట్(Spirit) చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు పాన్ ఇండియా స్టార్. అయితే ఈ హీరో రీసెంట్గా ‘నా ఉచ్ఛ్వాసం కవనం’ కార్యక్రమానికి గెస్ట్‌గా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభాస్ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి(Sirivennela Sitarama Shastri)తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేస్తున్నారు.
తాజాగా రిలీజైన మూడో ఎపిసోడ్లో తనకు ఇష్టమైన పాటల గురించి.. పెళ్లిపై కూడా ఫన్నీ కామెంట్స్ చేశారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) హీరోగా వచ్చిన జల్సా(Jalsa) మూవీలోని చలోరే చలోరే ల్ అంటే చాలా ఇష్టమని తెలిపాడు. దీని అర్థం గురించి ఎన్నిసార్లు మాట్లాడానో తనకే తెలియదని అన్నాడు. ఏ పార్టీకి వెళ్లిన ఈ పాట గురించి తప్పక తీస్తారని అన్నాడు. ‘రకరకాల ముసుగులు వేస్తూ మరిచాం ఎపుడో ముఖం’ అంటూ సాగే లైన్ అంటే ఎంత ఇష్టమో మాటల్లో చెప్పలేనని తెలిపాడు. ఎక్కడికెళ్లినా ఆ సాంగ్ ప్లే చేస్తానని.. ఫ్రెండ్స్ ముందు పెడితే మాత్రం వాళ్లు తన దగ్గర నుంచి పారిపోయేవారని చెప్పాడు. సిరివెన్నెల మూవీ కోసం రాసినా కూడా జీవితం గురించే రాసినట్లు అనిపిస్తుందన్నారు.
అలాగే మనీ మూవీలో భద్రం(Bhadraṁ) బీకేర్ ఫుల్ బ్రదర్ అని పాట రాశారని.. ఆ పాటలో వివాహం చేసుకోవద్దని ఉందని అన్నాడు. కొన్ని చిత్రాల్లో మ్యారేజ్ గురించి చాలా గొప్పగా రాశారని.. మరీ నేను ఇప్పుడు వివాహం చేసుకోవాలా? వద్దా? అంటూ ప్రభాస్ నవ్వుతూ ఫన్నీగా అన్నాడు. అలాగే చక్రంలో ‘జగమంత కుటుంబం’ సాంగ్ బాగుంటుందని.. విన్నప్పుడల్లా కన్నీళ్లు వస్తాయని పేర్కొన్నాడు. సిరివెన్నెల సీతారామశాస్త్రి తనలో స్ఫూర్తి నింపాడని పాన్ ఇండియా స్టార్ ‘నా ఉచ్ఛ్వాసం కవనం(Nā ucchvāsaṁ kavanaṁ)’ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. మొత్తానికి ప్రభాస్ పెళ్లి గురించి మాట్లాడటంతో ఫ్యాన్స్ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Read More ...
‘రాజాసాబ్’ లో ఆ సీన్స్ ఎక్కువ ఉంటాయి.. నిర్మాత ఇంట్రెస్టింగ్ కామెంట్స్