- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
KRR కళాశాల నిర్వాకం .. రిజల్ట్ చూసుకొని అవాక్కయిన విద్యార్థులు
దిశ, కోదాడ: ఆర్థిక కారణాలు, చిన్న వయసులో పెళ్లి, కొన్ని ఇతర కారణాల వల్ల విద్యార్థులు చిన్న వయసులోనే చదువు మధ్యలో బంద్ చేస్తుంటారు. అలాంటి విద్యార్థులు తిరిగి మళ్లీ చదువుకోవడం కోసం దూర విద్యా కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇందులో చదువుకున్న విద్యార్థులు అనేకమంది ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించారు. కళాశాల నిర్లక్ష్యమో, అధికారుల వైఫల్యమో తెలియదు కానీ, కొంతమంది విద్యార్థులు చేయని తప్పునకు బలవుతున్నారు. వివరాల్లోకి వెళితే..
కోదాడ పట్టణంలోని కాకతీయ దూర విద్యా కేంద్రంలో అనేకమంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఇందులో భాగంగా గతేడాది అక్టోబర్ నెలలో ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాశారు. దానికి సంబంధించిన ఫలితాలను ఈనెల శనివారం యూనివర్సిటీ విడుదల చేసింది. ఫలితాలు చూసుకున్న సెకండ్ ఇయర్ విద్యార్థులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. సుమారుగా 25 మంది విద్యార్థులకు పైగా మాల్ ప్రాక్టీస్ అని రిజల్ట్ చూపించడంతో వారు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ''మేము ఎక్కడా చూసి రాయలేదు. అందరిలాగానే పరీక్షలు రాశాం. పరీక్ష పూర్తయిన అనంతరం బుక్లెట్ అందజేసి వచ్చాం. మా పరీక్షను మాల్ ప్రాక్టీస్ అంటున్నారు, ఓకే మరి మా అక్క రిజల్ట్ కూడా మాల్ ప్రాక్టీస్ అని ఎలా వస్తుంది.'' ఓ స్టూడెంట్ ప్రశ్నిస్తున్నారు. మా జీవితాలతో చెలగాటం ఆడొద్దని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు.
ప్రోసీడింగ్స్ పాటించరా?
ఒకవేళ విద్యార్థులు నిజంగానే మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడితే, వారితో అండర్ టేకింగ్ రాయించుకొని బుక్ లేట్‌ను సీల్డ్ కవర్‌లో యూనివర్సిటీకి పంపించాల్సి ఉంటుంది. ఇవేమీ పాటించకుండా మాల్ ప్రాక్టీస్ అంటూ మమ్మల్ని ఎలా బలి చేస్తారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ నెల ఆరు నుంచి పరీక్షలు
ఇదిలా ఉండగా, ఈనెల 6వ తేదీ నుంచి యూనివర్సిటీ దూరవిద్య కేంద్రం పరీక్షలు జరగనున్నాయి. దీంతో మాల్ ప్రాక్టీస్ అయిన విద్యార్థులకు అవకాశం ఉంటుందా? ఉండదా? అనేది తెలియకుండా పోతుంది. అడ్మిషన్ వేసిన సెంటర్లో అడిగితే వారు ఏమి సమాధానం చెప్పడం లేదని, జరిగిన విషయాన్ని యూనివర్సిటీకి తెలియజేశామని సెంటర్ వారు చెబుతున్నారు. ఏం చేయాలో అర్థం కాక ఎవరిని అడగాలో తెలియక విద్యార్థులు మనోవేధనకు గురవుతున్నారు.
మాకు ఎటువంటి సంబంధం లేదు: KRR కాలేజీ ప్రిన్సిపాల్
సెకండియర్ విద్యార్థులు సుమారు 25 మంది పైగా మాల్ ప్రాక్టీస్ రిజల్ట్ చూపిస్తున్న విషయం మా దృష్టికి వచ్చింది. మెమో వారికి సంబంధించి మాల్ ప్రాక్టీస్ చేసినట్లుగా యూనివర్సిటీకి పంపించలేదు. పరీక్షలు జరుగుతున్న సమయంలో మేము తనిఖీలు చేసి, పట్టుబడ్డ విద్యార్థులకు మాత్రమే మాల్ ప్రాక్టీస్ కింద బుక్ చేశాం. మిగతా విద్యార్థులను మాల్ ప్రాక్టీస్ చేయలేదు. ఫలితాలు వచ్చిన వెంటనే మాకు తెలిసింది. కేఆర్ఆర్ కళాశాల పరీక్షల నిర్వహణలో పకడ్బంధీగా ఉంటుంది.