Asaduddin Owaisi: నుపుర్ శర్మ వివాదంలోకి మోడీ స్నేహితుడిని లాగిన ఒవైసీ

by Nagaya |   ( Updated:2022-06-20 13:36:39.0  )
Asaduddin Owaisi Criticizes Ajit Doval Over Agnipath Scheme
X

దిశ, వెబ్‌డెస్క్ : Modi Should Ask his Friend, If Nupur Sharma's Remarks Were Right, Says Asaduddin Owaisi| మహమ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై రచ్చ ఆగడం లేదు. తాజాగా మరోసారి ఈ అంశంలో ప్రధాని నరేంద్ర మోడీని ఎంఐఎం చీఫ్ అసద్దుదీన్ ఒవైసీ టార్గెట్‌గా చేసుకున్నారు. అయితే ఈ సారి ఈ వివాదంలోకి మోడీ చిన్న నాటి స్నేహితుడు అబ్బాస్‌ను లాగడం రాజకీయంగా చర్చనీయాంశం అవుతోంది. ఇంతకీ ఎవరీ అబ్బాస్? అతడిని వివాదంలోకి ఒవైసీ ఎందుకు లాగుతున్నాడు?..

ఏ చిన్న అవకాశం వచ్చినా ప్రధానిపై ఒవైసీ విమర్శల అస్త్రం సంధిస్తుంటాడు. ఇటీవల నుపుర్ శర్మ చేసిన వివాదాస్పద కామెంట్ల విషయంలోనూ ఆయన మోడీ తీరును తప్పుబడుతున్నాడు. నుపుర్ శర్మను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్న ఒవైసీ.. ఈ సారి మరింత ఘాటుగా స్పందించారు. బీజేపీలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసే వారికి అధిక ప్రాధాన్యత ఉంటుందని, ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో నెక్స్ట్ టైమ్ ఢిల్లీ బీజేపీ సీఎం అభ్యర్థిగా నుపుర్ శర్మను బీజేపీ ప్రకటించినా ఆశ్చర్యపోనక్కర్లేదని అన్నారు. అంతటితో ఆగని ఒవైసీ ప్రవక్త విషయంలో నుపుర్ శర్మ కామెంట్లపై తాము చేస్తున్న వాదన నిజమో కాదో మీ చిన్ననాటి స్నేహితుడు అబ్బాస్‌ను అడగాలని సెటైర్లు వేశారు.

ఎవరీ అబ్బాస్?

ఇటీవల తన తల్లి పుట్టిన రోజు సందర్భంగా నరేంద్ర మోడీ తన బాల్య స్నేహితుడు అబ్బాస్ గురించి ప్రస్తావించాడు. తన తల్లి తనతో పాటు అబ్బాస్‌ను కూడా సమానంగా చూసేదని, పండగల సమయంలో మాకు పిండి వంటలు చేసి పెట్టేదని గుర్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఒవైసీ తాజాగా స్పందించారు. మీకు అబ్బాస్ అనే స్నేహితుడు ఉన్నాడని ఇప్పటి వరకు తెలియదని అన్నారు. మీకు ఇలాంటి స్నేహితుడు ఉన్నాడని కట్టు కథ చెప్పే అవకాశం కూడా ఉంది. అయినా ఒక వేళ మీకు అబ్బాస్ అనే స్నేహితుడు ఉండి ఉంటే అతడికి అసదుద్దీన్ ఒవైసీ, ఇతర ముస్లిం మత గురువుల ప్రసంగాలు వినమని చెప్పండి. మా వాదనలో ఏదైనా తప్పు ఉందో లేదో అతడినే అడిగి కనుక్కోండి అంటూ మోడీకి సూచించారు. లేదా మీ స్నేహితుడి అడ్రస్ నాకు చెప్పండి నేనే అతడి వద్దకు వెళ్తాను. ప్రవక్త విషయంలో నుపుర్ శర్మ వ్యాఖ్యలు తప్పో, ఒప్పో అడిగి తెలుసుకుంటానని, నుపుర్ శర్మ వ్యాఖ్యలను అబ్బాస్ కూడా అంగీకరించడని ఒవైసీ అన్నారు.

Advertisement

Next Story

Most Viewed