- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
హోలీ కలర్స్.. ఇంట్లోనే సులభంగా తయారుచేసుకునే చిట్కాలు
దిశ, ఫీచర్స్ : ప్రతి ఏట వసంతకాలంలో వైభవంగా జరుపుకునే పండుగ హోలీ. చిన్నా, పెద్ద రంగుల్లో మునిగితేలడమే ఈ పండగ ప్రత్యేకత కాగా.. ఇండియాతో పాటు బంగ్లాదేశ్, నేపాల్‌లోనూ హోలీ సంబరాలు అంబరాన్ని అంటుతాయి. అయితే ఒకరికొకరు రంగులు చల్లుకునే ఈ ఉత్సవంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిసినా.. కలర్స్‌లో దాగుండే కెమికల్స్ మన చర్మం, జుట్టుతో పాటు పర్యావరణానికి హానికలిగిస్తాయి. అయినప్పటికీ ఏడాదికోసారి కోలాహలంగా జరిగే హోలీ వేడుకల్లో పాల్గొనాలంటే.. సహజసిద్ధంగా తయారు చేసిన రంగులు వాడటం ఉత్తమం. మరి శరీరానికి హాని కలిగించని ఆర్గానిక్ కలర్స్‌ను ఇంట్లోనే ఎలా తయారుచేసుకోవచ్చో తెలుసుకోండి..
రెడ్ :
ప్రకాశవంతమైన ఎరుపు రంగును మందార పువ్వుల నుంచి తయారు చేయొచ్చు. ముందుగా పువ్వులను ఎండబెట్టి ఆ తర్వాత రుబ్బుకోవాలి. ఎక్కువ మొత్తంలో రంగు కావాలంటే తగిన నిష్పత్తిలో బియ్యం పిండి లేదా శనగపిండిని యాడ్ చేయాలి. ఇక తడి రంగులు ఉపయోగించాలనుకునే వారు, దానిమ్మ తొక్కలను నీటిలో ఉడకబెట్టడం వల్ల నీరు ఎరుపు రంగులోకి మారుతుంది. మరో పద్ధతి విషయానికొస్తే.. పసుపుపై నిమ్మరసం పిండినపుడు రసాయనిక చర్య జరిగి అది ఎరుపు రంగులోకి మారుతుంది. దీన్ని సూర్యరశ్మికి దూరంగా సరైన వెంటిలేషన్ అందేలా ఆరబెట్టిన తర్వాత అరచేతుల మధ్య రుద్దితే ముదురు ఎరుపు వర్ణాన్ని చూడొచ్చు.
పసుపు :
పసుపు, శనగపిండిని సరైన నిష్పత్తి(20:80)లో బాగా కలుపుకున్న తర్వాత రెండు మూడు సార్లు ఫిల్టర్ చేస్తే సరి. చర్మానికి లేదా జుట్టుకు హాని కలిగించని సేంద్రియ, పర్యావరణ అనుకూల, శక్తివంతమైన పసుపు రంగును తయారైపోతుంది. ఇక పసుపులో అద్భుతమైన సౌందర్య గుణాలున్నాయి కాబట్టి హోలీ వేడుకల్లో చర్మానికి ఎటువంటి హాని తలపెట్టదు.
పింక్ లేదా మెజెంటా :
ప్రకాశవంతమైన గులాబీ రంగును పొందాలంటే బీట్‌రూట్‌కు మించిన ఇన్‌గ్రెడియంట్ లేదు. తడి రంగుల్లో ముదురు, రిచ్ మెజెంటా షేడ్ సృష్టించేందుకు కొన్ని బీట్‌రూట్ ముక్కలను నీటిలో ఉడకబెట్టవచ్చు. ఇక పొడి రంగు కావాలంటే పొడి బీట్‌రూట్‌ను మెత్తగా పేస్ట్‌లా చేసి ఎండలో ఆరబెట్టాలి. ఎక్కువ మొత్తంలో కావాలంటే.. రంగులుగా చల్లుకునే ముందు శనగ లేదా గోధుమ పిండితో కలిపితే సరిపోతుంది.
ఆకుపచ్చ :
పొడి హెన్నా నుంచి సహజమైన ఆకుపచ్చ రంగును పొందవచ్చు. పొడి రూపంలోని రంగుల కోసం బచ్చలికూర వంటి ఆకులను ఉపయోగించడం కూడా మంచి ఎంపికే. అయితే తడి రంగులు తయారు చేస్తున్నప్పుడు నీటిలో కలిసిన హెన్నా.. చర్మాన్ని ఎర్రటి-నారింజ రంగులోకి మారుస్తుందనే విషయం తప్పక గుర్తుంచుకోవాలి.
బ్రౌన్
200 గ్రాముల కాఫీ పొడిని నీటిలో వేసి గోధుమ రంగు వచ్చే వరకు మరిగించాలి. చల్లారిన తర్వాత అందులో మొక్కజొన్న పిండి(1.5 కిలోలు) కలిపి ఒక రోజు మొత్తం ఆరబెట్టాలి. చివరగా చాలాసార్లు జల్లెడ పట్టి, మంచి సువాసన కోసం కొన్ని చుక్కల రోజ్ వాటర్(10మి.లీ) కూడా జతచేయవచ్చు.
పర్పుల్(ఊదా)
4-5 బ్లాక్ క్యారెట్లను మిక్సీ గ్రైండర్‌లో తురుముకుని అందులో 250 గ్రాముల మొక్కజొన్న పిండిని కలపాలి. అదనపు వాసన కోసం 10ml రోజ్ వాటర్‌ను యాడ్ చేసి జల్లెడ పట్టేందుకు ముందు ఆరబెట్టాలి.
గ్రే(బూడిద రంగు)
ఉసిరి(ఇండియన్ గూస్‌బెర్రీ)ని ఉపయోగించి బూడిద రంగును సృష్టించవచ్చు. ఇందుకోసం ముందుగా ఉసిరిలోని గింజలను వేరుచేసి గ్రైండర్‌లో ఆడించాలి. ఈ లిక్విడ్‌కు మొక్కజొన్న పిండిని కలిపి రెండుమూడు సార్లు గాలికి ఆరబెట్టాలి.