OLA: ఉపయోగించిన కార్ల రిటైల్ వ్యాపారాన్ని మూసివేయనున్న ఓలా

by Harish |   ( Updated:2022-06-25 07:44:46.0  )
OLA Shuts Down Used Cars and Commerce Business and Focus On EVs
X

దిశ, వెబ్‌డెస్క్: OLA Shuts Down Used Cars and Commerce Business and Focus On EVs| రైడ్ హెయిలింగ్‌ కంపెనీ OLA తన ఉపయోగించిన కార్లను, వాణిజ్య విభాగం అయినటువంటి ఓలా డాష్‌ను మూసివేయాలని నిర్ణయించుకుంది. ఎలక్ట్రిక్ వాహనాల పై మరింత దృష్టి పెట్టడానికి ఈ నిర్ణయం తీసుకుంది. ఓలా సంస్థ ఎలక్ట్రిక్ కార్లు, సెల్ తయారీ, ఆర్థిక సేవలలో పెట్టుబడుల వేగాన్ని పెంచాలని చూస్తుంది. ఓలా రైడ్ హెయిలింగ్ వ్యాపారం బలమైన లాభదాయకత తో పాటు నెలవారీగా దాని అత్యధిక స్థూల సరుకుల విలువ (GMV)ని అందజేస్తోంది. కొత్తగా ప్రారంభించిన EV వ్యాపారం ద్వారా భారత్‌లో కొద్దినెలల్లోనే అతిపెద్ద EV కంపెనీగా OLA అవతరించింది. భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ అధికంగా ఉంది. విద్యుత్ విప్లవాన్ని వేగవంతం చేయడం కోసం 500 మిలియన్ల భారతీయులకు సేవ చేయడానికి పొర్ట్‌ఫోలియోలో బలమైన బ్యాలెన్స్ షీట్‌తో, ఎలక్ట్రిక్ కార్లు, సెల్ మాన్యుఫ్యాక్చరింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ వంటి కొత్త రంగాలలోకి పెట్టుబడులు, వృద్ధిని పెంచుతున్నామని కంపెనీ ప్రతినిధి తెలిపారు.

ఓలా ఎలక్ట్రిక్ EV విభాగంలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని చూస్తుంది. కొత్తగా 50-గిగావాట్ అవర్ వరకు సామర్థ్యంతో భారత్‌లో బ్యాటరీ సెల్ తయారీ ప్లాంట్‌ను నిర్మించడానికి ప్రపంచవ్యాప్తంగా వివిధ కంపెనీలతో చర్చలు జరుపుతోంది. ఓలా 2022-23 ఆర్థిక సంవత్సరం మొదటి రెండు నెలల్లో రూ. 500 కోట్ల ఆదాయాన్ని అధిగమించింది. ఈ ఏడాది చివరినాటికి 1 బిలియన్ డాలర్ల రన్ రేటును అధిగమించడానికి ప్రణాళికలు కలిగి ఉంది. ఏడాది చివరిలో ఓలా తన రెండవ EV స్కూటర్‌ను విడుదల చేయలని చూస్తుంది. ఇంతకుముందు విడుదల చేసిన మొదటి EV స్కూటర్లలో మంటలు అంటుకున్న సంఘటనల కారణంగా 1,441 యూనిట్ల ఎలక్ట్రిక్ బైక్‌లను రీకాల్ చేసింది. కంపెనీ 2023 లేదా 2024 నాటికి ఎలక్ట్రిక్ కారును అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు వేస్తుంది.

Advertisement

Next Story

Most Viewed