- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అయ్యో ఎంత పనయ్యిందే.. రెస్టారెంట్‌లో 30 నిమిషాల పాటు వెయిటింగ్.. అయినా లేడీ సూపర్ స్టార్‌ను పట్టించుకోని జనాలు..
దిశ, సినిమా: లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉంది. అలాగే తన జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన డాక్యుమెంటరీతో తాజాగా మన ముందుకు వచ్చింది. అయితే ఈ భామ ఈ మధ్య కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరోమారు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది నయన్. నవంబర్ 18న నయన్ బర్త్ డే వేడుకలను జరుపుకునేందుకు నయన్, విఘ్నేష్‌లు ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే అక్కడున్న కాకే దా హోటల్‌లో ఈ జంట నార్త్ ఇండియన్ తందూరి టేస్ట్ చేయడానికి సుమారు అరగంట పాటు వేచి చూడాల్సి వచ్చింది.
ఇక ఆ రెస్టారెంట్ చాలా బిజీగా ఉండటంతో టేబుల్ కోసం వీరిద్దరూ చాలా సేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత అక్కడి ఫుడ్ ఎంజాయ్ చేశారు. ఈ వీడియోను రెస్టారెంట్‌లోని వ్యక్తి ఎవరో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ డిన్నర్ డేట్, వీడియోపై విఘ్నేష్ శివన్ స్పందించారు. 'నవంబర్ 17న ఓ చిన్న బర్త్ డే ఈవెనింగ్ సెలబ్రేషన్స్ కోసం వెళ్లాం. ఆ క్షణాలను క్యాప్చర్ చేసిన వ్యక్తికి థాంక్స్' అంటూ రాసుకొచ్చాడు. అలాగే ఫుడ్ చాలా టేస్టీగా ఉందన్న విఘ్నేష్.. టేబుల్ కోసం 30 నిమిషాల పాటు వెయిట్ చేయాల్సి వచ్చిందని చెప్పడం విశేషం.
అయితే ఈ వీడియోలో ఈ సెలబ్రిటీ కపుల్ ఒకరికొకరు తినిపించుకోవడం చూడవచ్చు. హిందీలో ‘జవాన్’ లాంటి సినిమాలో షారుక్ ఖాన్‌తో కలిసి నటించి నార్త్‌లోనూ నయన్ మంచి పేరు సంపాదించుకుంది. అలాంటి సెలబ్రిటీ ఓ సాధారణ వ్యక్తి లాగా ఎంతో బిజీగా ఉన్న రెస్టారెంట్‌కు వెళ్లి అందరి మధ్యలో కూర్చొని తినడం అక్కడి వాళ్లను ఆకర్షించింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.మరి మీరు ఈ వీడియో పై ఓ లుక్ వేసేయండి.
Read More..
Sreeleela: వారణాసిలో శ్రీలీల పూజలు.. వైరలవుతోన్న పిక్స్..!!