- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆయుష్ కేంద్రాలకు ఆధారణేది..? కొరవడిన ఉన్నతాధికారుల పర్యవేక్షణ
దిశ, మునుగోడు: యునానీ, హోమియో, ఆయుర్వేదిక్ వైద్యం మరుగున పడుతుంది. ఇంగ్లీష్ మందులకు డిమాండ్ పెరగడంతో ఆయుష్ కేంద్రాలకు ఆదరణ తగ్గిపోతుంది. ప్రభుత్వం ఆయుష్ కేంద్రాల పేరుతో సేవలందిస్తున్న క్షేత్రస్థాయిలో రోగులకు సేవలు అందడం లేదు. అవగాహన లేకఒక కారణమైతే, వైద్యుల నిర్లక్ష్యం మరో కారణమవుతోంది. వైద్యులు కొరతతో ఆయుష్ కేంద్రాలకు ఫార్మసిస్ట్, అటెండర్ లే వైద్య సేవలు నిర్వహించాల్సిన పరిస్థితులున్నాయి.
మునుగోడు మండల కేంద్రంలోని హోమియోపతి కేంద్రానికి చెందిన కాంట్రాక్టు వైద్యురాలు తయ్యబా కౌసెర్ కు రెగ్యులర్ కావడంతో 2 సంవత్సరాల క్రితం ఇక్కడి నుంచి బదిలీ అయ్యారు. అప్పటి నుంచి స్థానిక హోమియోపతి వైద్యశాలకు వైద్యులు లేక ఫార్మసిస్ట్, అటెండర్ విధులు నిర్వహిస్తున్నారు. ఈ ఆసుపత్రిలో వైద్యులు లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఆసుపత్రికి రాకపోవడంతో రోజు రోజుకు రోగుల సంఖ్య తగ్గిపోతుంది. దీంతో విలువైన హోమియోపతి మందులు కాలం చెల్లి పోతున్నాయి. రెగ్యులర్ వైద్యులను నియమించాలని స్థానికులు కోరుతున్నారు.
వైద్యులను కేటాయించడంతో జాప్యం..
ఆయుష్ కేంద్రాల పై జిల్లా స్థాయిలో అప్పుడప్పుడు పర్యవేక్షణ చేసిన వైద్యులను కేటాయించడం లో జాప్యం. యునానీ ,హోమియో,ఆయుర్వేదం ఆసుపత్రులు సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా అక్కడ వైద్యులు ఉన్నారా.. లేదా అన్న కనీస బాధ్యత జిల్లా అధికారులకు లేకపోవడంతో వైద్యశాల ఉన్న లేనట్లే అనిపిస్తుందని పలువురు వాపోతున్నారు.. ప్రభుత్వం లక్షల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేస్తున్న మందులు ఎందుకు పనికి రాకుండా పోతున్నాయి. తద్వారా ఆయుర్వేద వైద్యం చేయించుకోవడానికి రోగులు శ్రద్ధ చూపడం లేదు. ఇప్పటికైనా పాలకులు స్పందించి కేంద్రాలపై జిల్లాస్థాయి అధికారులు దృష్టి సారించి వెంటనే వైద్యులను కేటాయించేలా చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.