పాక్ ప్రధానిపై అవిశ్వాసం.. మద్దతు ఉపసంహరించుకున్న మిత్రపక్షాలు

by Manoj |
పాక్ ప్రధానిపై అవిశ్వాసం.. మద్దతు ఉపసంహరించుకున్న మిత్రపక్షాలు
X

ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి రోజుకో షాక్ తగులుతుంది. కొన్ని రోజుల క్రితమే మిత్ర పక్షాలు మద్దతు ఉపసంహరించున్న సంగతి తెలిసిందే. తాజాగా జంహూరి వతన్ పార్టీ(జెడబ్ల్యూపీ) చీఫ్ షాజైన్ బుగ్టీ ప్రభుత్వం నుంచి వేరుపడినట్లు తెలిపారు. అంతేకాకుండా ప్రధానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానానికి తన ఓటు వేయనున్నట్లు చెప్పారు. అంతేకాకుండా ఇమ్రాన్ ఖాన్ స్పెషల్ అసిస్టెంట్‌గా అందిస్తున్న సేవల నుంచి కూడా తప్పుకున్నట్లు స్థానిక మీడియా పేర్కొంది. అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టక ముందే ఇమ్రాన్ ఖాన్ రాజీనామా చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు పార్టీ నిషేధిత నిధులు అందాయనే కారణంతో ఆయన అరెస్ట్ కు కూడా అంతా సన్నద్ధమైనట్లు పలు కథనాలు పేర్కొన్నాయి. ఇప్పటికే ప్రభుత్వానికి చెందిన 50 మంది మంత్రులు కనిపించకుండా పోయారని పలు పత్రికలు పేర్కొన్నాయి. మొత్తం 342 మంది ఉన్న దిగువ సభ నేషనల్ అసెంబ్లీలో ఇమ్రాన్ ఖాన్ గట్టెక్కాలంటే 172 మంది మద్దతు అవసరం ఉంది. అయితే మిత్రపక్షాలు సరైన సమయంలో తప్పుకోవడం ఇమ్రాన్ ఖాన్ ను ఇబ్బంది పెడుతోంది. సోమవారం ఉదయం 11 గంటలకు నేషనల్ అసెంబ్లీ ప్రారంభం కానుంది.

వైట్ కాలర్ నేరగాళ్ల వల్లే దేశంలో పేదరికం: ఇమ్రాన్ ఖాన్

పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో వైట్ కాలర్ నేరగాళ్లు ఎక్కువగా ఉండటం వల్లనే పేదరికం ఉందని అన్నారు. ఇస్లామాబాద్‌లో జరిగిన ర్యాలీలో ఆదివారం ఆయన ప్రసంగించారు. పాకిస్తాన్‌ను ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా చేసేందుకే రాజకీయాల్లోకి ప్రవేశించినట్లు తెలిపారు. తమ ప్రభుత్వం లాగా పాక్ చరిత్రలో ఏ ప్రభుత్వం కూడా చేయలేదని నొక్కి చెప్పారు. కేవలం మూడున్నర ఏళ్లలోనే గొప్ప పాలనను అందించినట్లు తెలిపారు. ఇమ్రాన్ ఖాన్ ఎవ్వరికీ తలవంచడని, తన దేశాన్ని కూడా ఇతరుల ముందు తలవంచుకునేలా చేయడని చెప్పారు. దేశంలో దొంగల దోపిడి వల్ల భారత్, బంగ్లాదేశ్‌లు పాకిస్తాన్ కన్నా ముందంజలో ఉన్నాయని తెలిపారు. కరోనా సమయంతో తాను తీసుకున్న చర్యలు ప్రపంచం గుర్తించిందని అన్నారు. తమ ప్రభుత్వమే మహిళలకు వారసత్వ హక్కు కల్పించే బిల్లును తీసుకువచ్చామని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed