యూకేలో మరో కొత్త వేరియంట్.. ఒమిక్రాన్ కన్నా డేంజర్: డబ్ల్యూహెచ్‌వో

by Satheesh |   ( Updated:2022-04-02 16:26:05.0  )
యూకేలో మరో కొత్త వేరియంట్.. ఒమిక్రాన్ కన్నా డేంజర్: డబ్ల్యూహెచ్‌వో
X

లండన్: కరోనా రోజురోజుకూ రూపాన్ని మార్చుకుంటూ వ్యాప్తి చెందుతూనే ఉంది.తాజాగా యూకే కొత్త వేరియంట్‌ను కనుగొన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక పేర్కొంది. ఎక్సీఈగా పిలువబడే ఈ కొత్త వేరియంట్, ఇతర కరోనా ఇతర జాతుల కంటే ఎక్కువగా వ్యాప్తి చెందుతుందని ఆరోగ్య సంస్థ తెలిపింది. ఇది బీఏ1, బీఏ2 ఒమిక్రాన్ వేరియంట్ల రీకాంబినేషన్‌గా సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఈ వేరియంట్ ప్రపంచంలోని నమోదు అవుతున్న కొన్ని కేసులలో వెలుగు చూసిందని తెలిపారు. ఈ వేరియంట్‌ను మొదటి సారిగా యూకేలో జనవరి 19న గుర్తించినట్లు బ్రిటన్ వైద్య సంస్థ తెలిపింది. ఇప్పటివరకు ఈ తరహా కేసులు 637 గుర్తించినట్లు తెలిపింది. కాగా బీఏ.2 ఉప-వేరియంట్ అయిన ఒమిక్రాన్ ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరించిన సంగతి తెలిసిందే. వీటి గురించి పూర్తి స్థాయిలో తెలుసుకునేందుకు పరిశోధనలు జరుగుతున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరోవైపు చైనా, అమెరికాలోనూ కరోనా కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకు 49 కోట్ల మందికి పైగా కరోనా బారిన పడగా, 61 లక్షలకు పైగా మరణించారు.

Advertisement

Next Story

Most Viewed