కేటీఆర్ అలా.. కేసీఆర్ ఇలా.. ఢిల్లీలో సీఎం ప్రసంగంపై విమర్శలు..!

by Satheesh |   ( Updated:2022-04-11 14:55:06.0  )
కేటీఆర్ అలా.. కేసీఆర్ ఇలా.. ఢిల్లీలో సీఎం ప్రసంగంపై విమర్శలు..!
X

దిశ, డైనమిక్ బ్యూరో: వివిధ రాష్ట్రాల ప్రజలు ఇంగ్లీషులో కాకుండా హిందీలో మాట్లాడాలని హోంమంత్రి అమిత్ షా అన్న వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దూమారం రేపిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన కేటీఆర్.. 'నేను మొదట భారతీయుడిని, నా మాతృభాష తెలుగు.. హిందీ, ఇంగ్లీష్, ఉర్దూలో కూడా కొంచెం మాట్లాడగలను' అని తెలిపాడు. ఇదిలా ఉంటే, ఈ రోజు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. ఢిల్లీలో టీఆర్ఎస్ చేపట్టిన ధర్నాలో సీఎం కేసీఆర్ హిందీలో ప్రసంగించారు. నెటిజెన్లు కేసీఆర్ మాట్లాడిన స్పీచ్‌ను.. గతంలో కేటీఆర్ తెలుగు భాష గురించి చేసిన ట్వీట్‌కు ట్యాగ్ చేస్తూ.. ఈ రోజు కేసీఆర్ హిందీలో ఎందుకు మాట్లాడారు అంటూ విమర్శలు కురిపిస్తున్నారు.

Advertisement

Next Story