Neha Dhupia: కొడుకుతో నేహా ధూపియా వర్కవుట్ సెషన్..

by Satheesh |   ( Updated:2022-04-25 12:11:58.0  )
Neha Dhupia: కొడుకుతో నేహా ధూపియా వర్కవుట్ సెషన్..
X

Neha Dhupia

దిశ, సినిమా: బాడీ ఫిట్‌గా ఉండేందుకు సెలబ్రిటీలతో పాటు సాధారణ వ్యక్తులు కూడా యోగా లేదా వర్కవుట్స్ చేస్తుంటారు. మరికొందరైతే కుటుంబ సభ్యులతో కలిసి ఇలాంటి సెషన్స్‌ కొనసాగిస్తుంటారు. అలానే బీటౌన్ నటి నేహా ధూపియా(Neha Dhupia) కూడా తన క్యూటెస్ట్ పార్ట్‌నర్‌తో యోగా సెషన్‌లో మునిగిపోయింది. ఇంతకీ ఆ యోగా పార్ట్‌నర్ ఎవరో తెలుసా? మరెవరో కాదు ఆమె కొడుకు గురిక్ సింగ్ ధూపియా బేడీ. రీసెంట్‌గా నేహా యోగా ప్రాక్టీస్ చేస్తుండగా.. ఆమె కొడుకు సైతం చిట్టి చేతులు, కాళ్లతో అచ్చం తనలా చేయడం ప్రారంభించాడు. వెంటనే ఆ దృశ్యాన్ని క్యాప్చర్ చేసిన నేహా.. గురిక్‌ను తన 'మండే మోటివేషన్'గా పేర్కొంటూ ఆ పిక్ పోస్టు చేసింది. ఇక ఈ ఫొటో తన అభిమానులను ఆశ్చర్యపరచగా.. నెటిజన్లు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఈ క్యూట్ పిక్‌పై స్పందించిన నటి కత్రినా కైఫ్ రెడ్ హార్ట్ ఎమోటికాన్‌తో రిప్లయ్ ఇచ్చింది.




Advertisement

Next Story