‘నరుడి బ్రతుకు నటన’ హార్ట్ టచింగ్ మూవీ

by Hamsa |   ( Updated:2024-10-23 16:02:01.0  )
‘నరుడి బ్రతుకు నటన’ హార్ట్ టచింగ్ మూవీ
X

దిశ, సినిమా: శివకుమార్ రామచంద్రవరపు(Shivakumar Ramachandravarapu), నితిన్ ప్రసన్న ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన చిత్రం ‘నరుడి బ్రతుకు నటన’. శృతి జయన్, ఐశ్వర్య అనిల్ కుమార్(Aishwarya Anil Kumar), వైవా రాఘవ్ ఇతర ప్రముఖ తారాగణంతో రాబోతున్న ఈ సినిమాకు రిషికేశ్వర్ యోగి దర్శకత్వం వహించారు. టీజీ విశ్వ ప్రసాద్(TG Vishwa Prasad), సుకుమార్ బోరెడ్డి, డాక్టర్ సింధు రెడ్డి ఈ సినిమాను నిర్మించగా.. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరించారు. ‘నరుడి బ్రతుకు నటన’(Narudi Bratuku natana) ఈ చిత్రం అక్టోబర్ 25న గ్రాండ్ థియెట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా, ఇంటర్వ్యూలో పాల్గొన్న శివ కుమార్ రామచంద్రవరపు ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘‘దర్శకుడు రిషికేశ్వర్(Rishikeshwar) ఈ సినిమా కోసం నన్ను అప్రోచ్ అయ్యారు. తను చేసిన ఒక డెమో వీడియో చూపించారు.

అది నన్ను బాగా ఇంప్రెస్ చేసింది. దాంతో కథ కూడా వినను డైరెక్ట్‌గా షూటింగ్‌కు వెళ్లిపోదాం అని చెప్పాను. అంతగా తను చేసిన వీడియో ఆకట్టుకుంది. ‘నరుడి బ్రతుకు నటన’ కథ విన్న తర్వాత నా నమ్మకం మరింత రెట్టింపు అయ్యింది. సత్యమే శివం, శివపుత్రుడు తరహాలో ఒక మంచి అనుభూతికి, ఎమోషన్‌‌కు ప్రేక్షకులను గురిచేసే చిత్రమిది. ఈ చిత్రంలో సత్య అనే క్యారెక్టర్‌లో నటించాను. సత్య డబ్బున్న కుటుంబంలో పుట్టిన యువకుడు. తండ్రి పోషణలో సకల సౌకర్యాలతో హాయిగా బతుకుతుంటాడు. తనకు నటుడు కావాలనే కోరిక. అలాంటి సంపన్న కుటుంబంలోని యువకుడు అనుకోకుండా కేరళలోని ఓ తెలియని ప్రాంతానికి వెళ్తే అక్కడ ఎలా జీవనం సాగించాడు. అతనికి తోడుగా ఎవరు నిలిచారు అనేది ‘నరుడి బ్రతుకు నటన’ సినిమా కథ’’ అని చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story

Most Viewed