- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Chiru-Nagarjuna: చిరుకు ఆహ్వానం అందించిన కింగ్.. ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు స్టార్స్‌ను చూసి వావ్ అంటున్న నెటిజన్లు
దిశ, సినిమా: అక్కినేని నాగేశ్వరరావు(Nageswara Rao) శత దినోత్సవాలకు సంబంధించిన ఈవెంట్ ఇటీవల గ్రాండ్‌గా జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఇందులో భాగంగా ఈ ఏడాది అక్కినేని జాతీయ పురస్కారం చిరంజీవి(Chiranjeevi)కి ఇవ్వనున్నట్లు నాగ్ ప్రకటించారు. అయితే ఈ వేడుక అక్టోబర్ 28న అన్నపూర్ణ స్టూడియోలో జరగనుండగా.. ఈ ఈవెంట్‌కు అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan) గెస్ట్‌గా రానున్నారు. ఈ నేపథ్యంలో.. తాజాగా, నేడు నాగార్జున, మెగాస్టార్ చిరంజీవిని కలిసి అక్కినేని జాతీయ పురస్కారం స్వీకరించాలని గౌరవంగా ఆహ్వానించారు.
ఇందుకు సంబంధించిన ఫొటోలు కింగ్ నాగార్జున(Nagarjuna) ‘X’ వేదికగా షేర్ చేస్తూ ఆసక్తికర పోస్ట్ పెట్టారు. ‘‘ఈ ఏడాది నాకెంతో ప్రత్యేకమైనది. నాన్నగారి శతజయంతి వేడుకలకు చిరంజీవి, అమితాబ్ బచ్చన్ రానున్నారు. దీంతో ఈ వేడుక మరింత ప్రత్యేకంగా మారనుంది. ఈ శతజయంతి వేడుకను మరపురానిదిగా చేద్దాం’’ అని రాసుకొచ్చారు. ప్రజెంట్ నాగ్(Nagarjuna) పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఇద్దరు టాలీవుడ్ స్టార్స్‌ను ఒకే ఫ్రేమ్‌లో చూసిన అభిమానులు వావ్ సూపర్ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఈ అవార్డును ముఖ్య అతిథిగా హాజరు కానున్న అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా చిరంజీవికి అందించనున్నారు.