- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కోమటిరెడ్డి ఎంట్రీతో యాదాద్రిలో టెన్షన్.. భారీగా మోహరించిన పోలీసులు
దిశ,యాదగిరిగుట్ట : యాదాద్రి ఆలయ మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమంలో ప్రోటోకాల్ పాటించలేదని రాష్ట్ర ప్రభుత్వం పై స్థానిక పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా యాదాద్రిలో గత కొన్ని రోజులుగా ఆలయ ఈవో గీత రెడ్డి పై నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో శనివారం రోజు కోమటిరెడ్డి మహాకుంభ సంప్రోక్షణ అనంతరం మొట్టమొదటి సారి ఆలయాల దర్శనానికి రావడంతో యాదాద్రిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆటో యూనియన్ కార్మికులను కొండపైకి ఆటోలను అనుమతించాలంటూ పదకొండవ రోజు ధర్నా కార్యక్రమం కొనసాగుతుండగా స్థానిక జేఏసీ ఆధ్వర్యంలో దేవస్థాన ఈఓ కార్యాలయం ముట్టడి మహా ధర్నా నిర్వహిస్తున్నారనే ముందస్తు సమాచారంతో ఆలయం చుట్టూ ముందస్తుగా భారికేడ్లు చేసి భారీగా పోలీసులను మొహరించారు. అదేవిధంగా యాదాద్రి ఆలయ జేఏసీ ,ఆటో యునియన్ నాయకులను,కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేసి స్థానిక పోలీసు స్టేషన్‌కి తరలించారు.
యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్న ఎంపీ కోమటి రెడ్డి వెంకటరెడ్డికి ఆలయ అర్చకులు ప్రత్యేకంగా స్వాగతం పలికి స్వామివారి ఆశీర్వచనలు అందజేసి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం స్థానిక ఎంపీకి ప్రోటోకాల్ విషయమై ఆలయ ఈఓ ను ప్రశ్నించారు. ఆలయ ఈఓ కన్నీరు పెడుతూ సీఎం గారి ఆదేశాలు అనుగుణంగా ఆంక్షలు విధించడం జరుగుతుందని ఎంపీ గారితో వెల్లడించి కాంగ్రెస్ నాయకులు తమ దిష్టిబొమ్మను తగలబెట్టిన విషయమై ఆలయ ఈఓ గీత రెడ్డి కన్నీరు పెట్టుకుంది.