ఫొటోల కోసం 194MP కెమెరాతో అదిరిపోయే స్మార్ట్ ఫోన్..

by Disha Desk |   ( Updated:2022-02-24 12:51:23.0  )
ఫొటోల కోసం 194MP కెమెరాతో అదిరిపోయే స్మార్ట్ ఫోన్..
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజ సంస్థ Motorola నుంచి మరొ కొత్త ఫ్లాగ్ షిప్ 5G మోడల్‌లో Motorola Frontier మార్కెట్లోకి రానుంది. ఇది ప్రపంచంలోని మొట్టమొదటి 194MP ప్రైమరీ కెమెరా కలిగి ఉంటుందని సమాచారం. ఈ స్మార్ట్ ఫోన్ 6.67 ఇంచుల ఫుల్ హెచ్‌డీ+ OLED డిస్‌ప్లే, 144 హెట్జ్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఇది స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 అప్‌గ్రేడెడ్ వెర్షన్‌ చిప్‌సెట్‌ ద్వారా పనిచేస్తుంది. LPDDR5 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరెజ్‌ని కలిగి ఉంది. కెమెరా పరంగా ప్రపంచంలోనే మొట్టమొదటగా 194MP ప్రైమరీ సెన్సార్‌తో రానుంది. ఇంకా ఫోన్ వెనుక భాగంలో 50MP అల్ట్రా వైడ్ కెమెరా, 12MP టెలిఫొటో కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. సెల్ఫీల కోసం 32MP కెమెరాను అమర్చారు. యూఎస్‌బీ టైప్-సీ, 125W వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో 4500mAh బ్యాటరీని కలిగి ఉంది. వైఫై 6 ఈ, బ్లూటూత్ వీ5.2 కనెక్టివిటీని కలిగి ఉంది.

Advertisement

Next Story