'బార్బీ బొమ్మ' బర్త్‌డే.. పుట్టింది అప్పుడే..

by Javid Pasha |   ( Updated:2022-03-09 04:21:13.0  )
బార్బీ బొమ్మ బర్త్‌డే.. పుట్టింది అప్పుడే..
X

దిశ, ఫీచర్: చిన్న పిల్లలు ఎంతో ప్రేమగా ఆడుకునే 'బార్బీ బొమ్మ' అసలు పేరు 'బార్బరా మిల్లిసెంట్ రాబర్ట్స్'. అయితే 'బార్బీ' అనే ముద్దుపేరుతో ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయింది. ప్రముఖ అమెరికన్ వ్యాపారవేత్త రూత్ హ్యాండ్లర్ రూపొందించిన ఈ బార్బీ డాల్‌ 1959 మార్చి 9న న్యూ యార్క్‌లోని అమెరికన్ ఇంటర్నేషనల్ టాయ్ ఫెయిర్‌లో మొదటిసారి ప్రదర్శించబడింది. ఈ ప్రదర్శన తర్వాత ఒక్క నెలలోనే వరల్డ్‌వైడ్‌గా బిలియన్‌కు పైగా బొమ్మలు అమ్ముడవడం ఒక రికార్డ్‌. ఇలా అనతికాలంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద బొమ్మల కంపెనీగా పేరుగాంచిన 'మాటెల్ కంపెనీ'.. 18 వేలమంది ఉద్యోగులతో ఏటా $300 మిలియన్లకు పైగా అమ్మకాలు జరుపుతోంది. ఇక రూత్ హాండ్లర్ తన కూతురు 'బార్బారా' చిన్న చిన్న పేపర్ బొమ్మలతో ఆడుకోవడాన్ని గమనించి బార్బీని తయారు చేసినట్లు తెలపగా.. ఈ బొమ్మకు 'బిల్డ్ లిల్లీ' అనే జర్మన్ బొమ్మకు చాలా పోలికలు ఉన్నాయనే వాదనలు కూడా ఉన్నాయి.

Advertisement

Next Story

Most Viewed