- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఉద్యమకారిణి జయచంద్రిక ఉన్నత విద్యకు ఆర్థిక సాయం
దిశ ప్రతినిధి, నిజామాబాద్: రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వ కృషితో విద్యా వ్యవస్థ పూర్తిగా మెరుగుపడిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. శుక్రవారం హైదరాబాద్ లోని తన నివాసంలో జయ చంద్రిక అనే తెలంగాణ ఉద్యమకారిణి ఉన్నత విద్యకు గాను రూ.5లక్షల ఆర్ధిక సాయాన్ని ఎమ్మెల్సీ కవిత చేతుల మీదుగా అందజేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలు.. ప్రతి జిల్లాలో పెద్ద సంఖ్యలో గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వం, అన్ని స్థాయిల్లో అత్యున్నత విద్యా సౌకర్యాలు ఏర్పాటు చేసిందని అన్నారు. దాంతోపాటు విదేశీ విద్యకు సైతం రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక చేయూతనిస్తోందని గుర్తు చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లీష్ మీడియం విద్యను అందించనుండటం.. బాల,బాలికల ఉన్నత భవిష్యత్తుకు బంగారు పునాదులు వేస్తుందని తెలిపారు.
జయ చంద్రిక బాల్యం నుండి తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొనలేదని తెలిపారు. ఉద్యమ వేళ తెలంగాణ తల్లి వేషధారణతో జయచంద్రిక ప్రతి సమావేశంలోనూ ఆకర్షణీయంగా నిలిచిందని గుర్తు చేశారు. అనంతరం జయచంద్రికకు ఆర్థిక సాయం అందించిన మణికొండ రంజీత్ ను ఎమ్మెల్సీ కవిత అభినందించారు.