MLC Kavitha: రిపోర్టర్ జమీర్ మరణంపై ఎమ్మెల్సీ కవిత దిగ్భ్రాంతి

by GSrikanth |   ( Updated:2022-08-20 17:37:18.0  )
MLC Kavitha Expresses Condolences Reporter Zameer death
X

దిశ, డైనమిక్ బ్యూరో: MLC Kavitha Expresses Condolences Reporter Zameer death| జగిత్యాలకు చెందిన ఎన్టీవీ రిపోర్టర్ జమీర్ మరణంపై ఎమ్మెల్సీ కవిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విధి నిర్వాహణకు వెళ్ళిన జమీర్ వరదల్లో కొట్టుకుపోవడం అత్యంత బాధాకరం అని అన్నారు. జమీర్ కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. అంతే కాకుండా భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా జర్నలిస్టులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 'వార్తా సేకరణకు ప్రాధాన్యత ఇస్తూనే, వర్షాలు, వరదల పట్ల అప్రమత్తంగా ఉంటూ, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మీడియా మిత్రులను కోరుతున్నాను' అంటూ ట్వీట్ చేశారు. తెలంగాణలో ఎన్నడూ లేనంతగా కురుస్తున్న భారీ వర్షాలతో ఏ ఒక్కరూ ఇబ్బంది పడకుండా సీఎం కేసీఆర్ పటిష్ట చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. చెన్నూరు మండలం సోమన్‌పల్లి వద్ద గోదావరి నదిలో చిక్కుకున్న ఇద్దరిని ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా రక్షించడం రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమ‌ని ఆమె ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: నేడు బీజేపీ పార్లమెంటరీ బోర్డు మీటింగ్

Advertisement

Next Story

Most Viewed