Komatireddy Rajagopal Reddy: సోనియాకు రాజగోపాల్ రెడ్డి లేఖ.. అతడే టార్గెట్‌గా విమర్శలు

by Nagaya |   ( Updated:2022-08-04 12:07:50.0  )
MLA Komatireddy Rajagopal Reddy Sends Resignation Letter to Sonia Gandhi
X

దిశ, వెబ్‌డెస్క్: MLA Komatireddy Rajagopal Reddy Sends Resignation Letter to Sonia Gandhi| మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తూ సోనియా గాంధీకి లేఖ రాశారు. కాంగ్రెస్ ద్వారా గెలిచిన ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీని కొందరు నిర్వీర్యం చేస్తున్నారని, ఎమ్మెల్యేలను గెలిపించలేని వ్యక్తులు, గెలిచిన ఎమ్మెల్యేల్లో మనో ధైర్యం నింపలేకపోయారని అన్నారు. జైలు పాలైన వ్యక్తి ఆధ్వర్యంలో నేను కలిసి పని చేయలేనని లేఖలో చెప్పారు. అనేక పార్టీలు మారి స్వలాభం కోసం ఓ ప్రజా ప్రతినిధి చేయకూడని పనులు చేశారని, గతంలో మీపైనే వ్యక్తిగత విమర్శలు చేసిన వ్యక్తికి కీలకమైన బాధ్యతలు అప్పగించారని, ఇది తనను తీవ్రంగా బాధించిందని అన్నారు. పార్టీకి విధేయులైన వారిని అడుగడుగునా అవమానిస్తున్నారని అన్నారు. మీ నాయకత్వంలో ఏ పని అప్పగించినా రాజీ లేకుండా కష్టపడ్డానని, కన్నీళ్లు, కష్టాలు దిగమింగుకుంటూ పార్టీలో పని చేశానని అన్నారు.

30 ఏళ్లు ఎక్కడ రాజీ పడకుండా పార్టీ కోసం కష్టపడుతూ పని చేశానని అన్నారు. అనేక మంది బలిదానాలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ కుటుంబం చేతిలో బంధిగా మారిందని, ఈ బంధీ నుండి విడిపించేందుకు మరో ప్రజాస్వామిక పోరాటం అవసరం ఉందని తాను నమ్ముతున్నానని, అందువల్ల సబ్బండ వర్గాలు కోరుకున్న ప్రజా తెలంగాణలో ప్రజాస్వామిక పాలన అందించే దిశగా మరో రాజకీయ పోరాటం చేయాలని తాను నిర్ణయించుకున్నాని అన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ద్వారా గెలిచిన ఎమ్మెల్యే పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని లేఖలో పేర్కొన్నారు. దయచేసి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి తాను చేసిన రాజీనామాను ఆమోదించాలని కోరారు.

ఇది కూడా చదవండి: ఏం తమాషాలు చేస్తున్నారా...? గరీబోళ్ల జోలికొస్తే ఖబర్దార్

Advertisement

Next Story