ఒంటినిండా రంగులతో జగ్గారెడ్డి మాస్ డ్యాన్స్ (వీడియో)

by GSrikanth |   ( Updated:2023-12-15 14:26:46.0  )
ఒంటినిండా రంగులతో జగ్గారెడ్డి మాస్ డ్యాన్స్ (వీడియో)
X

దిశ ప్రతినిధి, సంగారెడ్డి: హోలీ సంబురాల్లో సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి దూందాం స్టెప్పులు వేశారు. యువతతో కలిసి కేరింతల మధ్య హల్‌చల్ చేశారు. సంగారెడ్డి పట్టణంలో కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు స్థానిక పట్టణ యువత, తన సన్నిహితుల ఆధ్వర్యంలో హోలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జగ్గారెడ్డి ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. తెల్ల షర్టుతో హైదరాబాద్​నుంచి వచ్చిన నిమిషాల్లోనే జగ్గారెడ్డిని గుర్తు పట్టకుండా రంగులు పూశారు. డప్పు వాయిస్తూ కార్యకర్తలతో కలిసి ఆయన తీన్మార్​స్టెప్పులు వేశారు. ఈ సందర్భంగా యువతంతా జై జగ్గన్నా.. జై జై జగ్గన్నా.. అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. డప్పు వాయిస్తున్న సమయంలో జగ్గారెడ్డిపై సన్నిహితులు నోట్ల వర్షం కురిపించారు. యువకులు జగ్గారెడ్డితో సెల్ఫీలు తీసుకోవడానికి పోటీలు పడ్డారు. మొత్తంగా హోలీ సంబురాల్లో హల్ చల్ చేసి యువతలో జగ్గారెడ్డి ఉత్సాహం నింపారు.


Advertisement

Next Story