అవినీతి ఎమ్మెల్యేను తరిమి కొట్టాలి: బీజేపీ

by Disha News Desk |
అవినీతి ఎమ్మెల్యేను తరిమి కొట్టాలి: బీజేపీ
X

దిశ, స్టేషన్ ఘన్ పూర్: ప్రభుత్వ పథకాలు, పదవులను అమ్ముకుంటూ రాజకీయ వ్యాపారం చేస్తున్న అవినీతి ఎమ్మెల్యే రాజయ్యను నియోజకవర్గం నుండి తరిమికొట్టాలి అని బీజేపీ రాష్ట్ర నాయకుడు మాదాసు వెంకటేష్ అన్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం కోమటిగుడెం గ్రామానికి చెందిన వివిధ పార్టీల యువకులు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి కార్యకర్త బీజేపీ పథకాలను కేసీఆర్ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను, ఎమ్మెల్యే రాజయ్య చేస్తున్న అవినీతి పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లి బీజేపీ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి బాస్కుల ఆరోగ్యం, మండల ఉపాధ్యక్షులు మూషిగుంపుల ఉపేందర్, చట్ల రాజ్ కుమార్, ఎస్సీ మోర్చా మండల రడపాక ప్రదీప్, మూల రాజు, వద్దుల తిరుపతి, దయాకర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story