- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహిళా సంక్షేమానికి కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారు: ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి
దిశ ఉప్పల్: టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చిల్కానగర్ డివిజన్ ఉప్పల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్ ఆధ్వర్యంలో మహిళా బంధు రెండో రోజు సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మహిళల భద్రతకు పెద్దపీట వేస్తూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ భరోసా కేంద్రాలు, షీ టీమ్స్ వంటివి ఏర్పాటు చేశారని అన్నారు. వడ్డీలేని రుణాల ద్వారా రాష్ట్రంలో 40.58 లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూరిందని అన్నారు. మహిళలకు ప్రత్యేక పారిశ్రామిక పార్కులు, ప్రత్యేక విద్యా సంస్థలతో పాటు, రాజకీయ రంగంలోనూ మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక కేంద్రం డాక్టర్ సౌందర్య లత, సూపర్వైజర్ భోగ ప్రకాష్, టీఆర్ఎస్ మహిళా నాయకులు సుభద్ర, తదితరులు పాల్గొన్నారు.