మధ్యలో మాట్లాడటానికి బండి సంజయ్ ఎవరు?

by GSrikanth |
మధ్యలో మాట్లాడటానికి బండి సంజయ్ ఎవరు?
X

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌పై తెలంగాణ వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలుపై బండి సంజయ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడని విమర్శించారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి లేదా సంబంధిత అధికారులు స్పష్టతనివ్వాలని కానీ, మధ్యలో మాట్లాడటానికి బండి సంజయ్ ఎవరు అని ప్రశ్నించారు. ఎంపీ గెలిచిన నాటినుంచి తెలంగాణ ప్రజలకు బండి ఏం వెలగబెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. పంజాబ్ తరహాలో తెలంగాణలోనూ ధాన్యం కొనుగోలు చేయాలని అన్నారు. ఒక ఎంపీ అయ్యుండి రాష్ట్ర ముఖ్యమంత్రిపై ఇష్టానుసారం మాట్లాడటం సరికాదని హెచ్చరించారు.

Advertisement

Next Story