- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉద్యమకారుని పాడె మోసిన మంత్రి నిరంజన్ రెడ్డి
దిశ, వనపర్తి : రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మలిదశ తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుడు మణిగిళ్ల నాగిరెడ్డి పాడె మోశారు. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్ టూర్ గ్రామానికి చెందిన నాగిరెడ్డి అనారోగ్యంతో సోమవారం సాయంత్రం మృతి చెందారు. మంగళవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మణిగిళ్ల నాగిరెడ్డి మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం నాగిరెడ్డి అంతిమ యాత్రలో పాల్గొని పాడె మోశారు. 2001 మలిదశ తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొని, మండల టీఆర్ఎస్‌లో క్రియాశీలక పాత్ర పోషించిన వ్యక్తి మృతి చెందడం చాలా బాధాకరమని నిరంజన్ అన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఓ మంచి నాయకుడుని కోల్పోయిందని బాధపడ్డారు. ఉద్యమకారుడు నాగిరెడ్డి మృతి కారణంగా మంత్రి తను పాల్గొనాల్సిన కార్యక్రమాలను వాయిదా వేశారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్ రెడ్డి, వెల్టూరు గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ సింగిల్ విండో ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.