వాళ్ల దీక్షకు మద్దతు తెలిపిన మంత్రి హరీష్ రావు

by S Gopi |
వాళ్ల దీక్షకు మద్దతు తెలిపిన మంత్రి హరీష్ రావు
X

దిశ, ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫ్యాక్టరీని ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ సాధన కమిటీ చేపట్టిన రిలే దీక్షకు రాష్ట్ర మంత్రులు హరీష్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి లు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. 100 ఏళ్ళకు సరిపడే ముడిసరుకు ఉన్న కేంద్ర ప్రభుత్వం వెంటనే సీసీఐని ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఫ్యాక్టరీ ప్రారంభిస్తే జిల్లాలోని యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయన్నారు. తమ ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని, ఇప్పటికే మంత్రి కేటీఆర్ లేఖ రాశారని గుర్తు చేశారు. మద్దతు తెలిపినవారిలో ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాథోడ్ బాపురావు, పలువురు నాయకులు ఉన్నారు.

Advertisement

Next Story