- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
$500 మిలియన్ల నిధుల వేటలో MG మోటార్ ఇండియా..!
దిశ, వెబ్‌డెస్క్: చైనాకు చెందిన SAIC మోటార్ కార్ప్ యాజమాన్యంలోని MG మోటార్, భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (EVలు) విస్తరణతో సహా దాని భవిష్యత్తు అవసరాలకు ప్రైవేట్ ఈక్విటీలో రూ. 2,650-3,800($350-500 మిలియన్లు) కోట్ల నిధులను సమీకరించాలని యోచిస్తోంది. నిధుల సమీకరణ కోసం MG మోటార్ ఇండియా ఇప్పటికే ప్రయత్నాలు మొదలు పెట్టింది. రూ.10 లక్షల లోపు ప్రారంభ ధర కలిగిన చిన్న హ్యాచ్‌బ్యాక్ నుండి కాంపాక్ట్ SUV, హై-ఎండ్ D-సెగ్మెంట్ SUV వరకు ఎలక్ట్రిక్ వాహనాల(EV)ను ప్రారంభించాలని ఇది యోచిస్తోంది. కాంపాక్ట్ EVలు కూడా ఎక్కువగా GS లేదా గ్లోబల్ స్మాల్ EV ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటాయి. ఇవి SAIC-GM ద్వారా సమిష్టిగా అభివృద్ధి చేయబడ్డాయి. ఇవి భారతదేశం, ఇండోనేషియాతో సహా అభివృద్ది చెందుతున్న మార్కెట్‌లకు ఉపయోగపడుతుంది. ఇండియాకోసం ఉద్దేశించిన C, D-సెగ్మెంట్ EVలు కూడా సిగ్మా ప్లాట్‌ఫారమ్ నుండి రావచ్చు. EV హ్యాచ్‌బ్యాక్, పూర్తి చార్జింగ్‌తో 200 కి.మీల పరిధితో, 2023 ప్రాథమిక త్రైమాసికంలో రోడ్లపైకి రానుంది.