- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ ముఖ్యమంత్రితో మెగా కోడలు.. శ్రీ రేవంత్ రెడ్డి గారికి థాంక్యూ అంటూ స్పెషల్ పోస్ట్
దిశ, వెబ్‌డెస్క్: రామ్ చరణ్ సతీమణి, మెగా ఇంటి కోడలు ఉపాసన గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఈమె రామ్ చరణ్ భార్యగానే కాక అపోలో సంస్థల ప్రతినిధిగా, వ్యాపారవేత్తగా గుర్తింపు తెచ్చుకుంది. అపోలోలో కీలక బాధ్యతలు పోషిస్తూ అపోలోని విస్తరించడమే కాక, మరి కొన్ని కొత్తరకాల బిజినెస్‌లు ప్రారంభించి, పలు బిజినెస్‌లలో పెట్టుబడులు పెట్టింది. ముఖ్యంగా హెల్త్ కేర్ రంగం పైనే ఎక్కువ ఫోకస్ చేస్తోంది. అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటూ పలు పోస్టులు పెడుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈమె పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.
తాజాగా ఉపాసన ఇన్‌స్టా వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, అలాగే ఉపాసన తండ్రి అనిల్ కామినేని గారితో ఉన్న పిక్స్ షేర్ చేస్తూ.. "తెలంగాణ వారసత్వం, సంస్కృతిని పరిరక్షించడంలో చేసిన కృషికి, అలాగే భారతదేశంలో విలువిద్య క్రీడకు తిరుగులేని మద్దతిచ్చినందుకు గాను మా నాన్నగారు శ్రీ అనిల్ కామినేని గారిని గౌరవించినందుకు మా తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి థాంక్యూ , లవ్ యూ డాడ్” అనే క్యాప్షన్‌ను జోడించింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట హల్‌చల్ చేస్తోంది.
(video link credits upasana konidela instgram id)
- Tags
- upasana kamineni