- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Meenakshi Chaudhary: అక్కినేని హీరోతో పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్!
దిశ, సినిమా: ‘ఇచట వాహనములు నిలుపరాదు’ (Ichata Vahanamulu Niluparadu) చిత్రంతో టాలీవుడ్ (Tollywood) ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary).. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఇక ఇటీవల ‘లక్కీ భాస్కర్’ (Lucky Bhaskar)తో మంచి హిట్ కూడా తన ఖాతాలో వేసుకుంది. కానీ ఈ సంతోషంగా ఎక్కువ రోజులు నిలువలేదు. రీసెంట్‌గా నటించిన ‘మట్కా’ (Matka) సినిమా బాక్సాఫీస్ (Box office) వద్ద యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది. ఇక ఇవే కాకుండా.. త్వరలో విశ్వక్ సేన్ ‘మెకానిక్ రాకీ’ (Mechanic Rocky) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఇలా వరుస సినిమాలతో ప్రేక్షకులను పలకరిస్తున్న మీనాక్షి చౌదరి పేరు ప్రజెంట్ సోషల్ మీడియాలో గట్టిగా వైరల్ అవుతోంది. దానికి కారణం.. ఈ బ్యూటీ అక్కినేని ఫ్యామిలీకి చెందిన హీరో సుశాంత్ (Sushant)ను పెళ్లి చేసుకుంటుందనే వార్తలు గత రెండు రోజులుగా నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
ఈ రూమర్స్‌పై స్పందించిన మీనాక్షి చౌదరి టీమ్.. ‘అవన్నీ అసత్య వార్తలు. వాళ్లు ఇద్దరు మంచి ఫ్రెండ్స్. పెళ్లి చేసుకుంటున్నారు అని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు’ అని చెప్పి క్లారిటీ ఇచ్చారు. అయితే.. ‘ఇచట వాహనములు నిలుపరాదు’ చిత్రంతో సుశాంత్‌కు మీనాక్షి చౌదరికి పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి వీరిద్దరూ మంచి ఫ్రెండ్స్‌గా ఉంటున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల వీరిద్దరూ కలిశారట. దీంతో పెళ్లి రూమర్స్ (rumors) బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. కాగా.. మీనాక్షి చౌదరి టీమ్ ఈ విషయం స్పందించి క్లారిటీ ఇవ్వడంతో ఈ రూమర్స్‌కు చెక్ పెట్టినట్లు అయింది.