Marco Movie టీజర్ రిలీజ్.. మోస్ట్ వైలెంట్‌‌ మ్యాన్‌గా దర్శనమిచ్చి షాకిచ్చిన స్టార్ నటుడు

by Hamsa |   ( Updated:2024-11-04 09:07:59.0  )
Marco Movie టీజర్ రిలీజ్.. మోస్ట్ వైలెంట్‌‌ మ్యాన్‌గా దర్శనమిచ్చి షాకిచ్చిన స్టార్ నటుడు
X

దిశ, సినిమా: కోలీవుడ్ హీరో ఉన్ని ముకుందన్(Unni Mukundan) భాగమతి, యశోద, యశోద, జనతా గ్యారేజ్(Janatha Garage) వంటి సినిమాలతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఓ వైపు హీరోగా నటిస్తూనే మరో వైపే క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా వెరైటీ రోల్స్‌లో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ప్రజెంట్ ఉన్ని ముకుందన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మార్కో’(Marco).

ఈ చిత్రానికి హనీష్ అదేని(Hanish Adeni) దర్శకత్వం వహిస్తుండగా.. దీనిని క్యూబ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్(Cubes Entertainments), ఉన్ని ముకుందన్ ఫిలిమ్స్ బ్యానర్స్‌పై మహ్మద్ అబ్దుల్ గదాఫ్ నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో యుక్తి తరేజా, ఆన్సన్ పాల్(Anson Paul), కబీర్ దుహాన్ సింగ్, జగదీశ్, సిద్ధిక్, రియాజ్ ఖాన్(Riaz Khan), శ్రీజిత్ రవి కీలక పాత్రలో కనిపించనున్నారు. ‘మార్కో’(Marco) మూవీ 2024 క్రిస్మస్ కానుకగా పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ వంటి భాషల్లో విడుదల కాబోతుంది.

ఈ నేపథ్యంలో.. తాజాగా, ‘మార్కో’ సినిమాకు సంబంధించిన తెలుగు టీజర్‌ను మేకర్స్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి(Anushka Shetty) చేతుల మీదుగా రిలీజ్ చేయించారు. అయితే ఇందులో ఉన్ని ముకుందన్ మోస్ట్ వైలెంట్ మ్యాన్‌(Valiant Man)గా కనిపించి అందరినీ షాక్‌కు గురి చేశారు. టీజర్‌లో ‘‘జీవితంలో మనల్ని హాంట్ చేసే విషయం ఏంటో తెలుసా.. మనకు ఎంతో ఇష్టమైన వాళ్ళని మన కళ్ల ముందే చిత్ర హింసలు పెట్టి చంపడం’’ అనే డైలాగ్ హైలెట్‌గా నిలిచింది.


Advertisement

Next Story

Most Viewed