- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జీతం 40 వేలు.. కానీ ఖాతాలో కోటిన్నర జమ.. కంపెనీతో ఆడుకుంటున్న ఎంప్లాయి..
దిశ, ఫీచర్స్ : ప్రతీ నెల జీతం కోసం ఎదురుచూసే ఎంప్లాయికి బంపర్ ఆఫర్ తగిలింది. నార్మల్ శాలరీ కంటే 286 రెట్లు ఎక్కువ మొత్తం ఎకౌంట్‌కు యాడ్ కావడంతో రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యే భాగ్యం దక్కింది. అయితే పొరపాటున జరిగిన ఈ ట్రాన్సాక్షన్ గురించి కంపెనీ సదరు ఉద్యోగిని సంప్రదించగా.. మార్నింగ్ బ్యాంక్‌కు వెళ్లి మనీ రిటర్న్ చేస్తానని హామీ ఇచ్చాడు. కానీ అంత డబ్బు వదులుకునేందుకు ఇష్టపడక ఉన్నట్టుండి మాయమైపోయాడు. లాయర్ ద్వారా రాజీనామా లేఖ పంపించి.. ఎవరికీ దొరక్కుండా చెక్కేశాడు. అప్పటి నుంచి ఫోన్ కాల్, మెసేజ్‌కు కూడా అందుబాటులో లేకపోగా.. ప్రస్తుతం కంపెనీ యాజమాన్యం ఆ వ్యక్తిని వెతికి పట్టుకునే పనిలో ఉంది.
చిలీలో మాంసం ఉత్పత్తి కంపెనీల్లో ఒకటైన కన్సోర్సియో ఇండస్ట్రియల్ డి అలిమెంటోస్(CIAL)లో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో మాజీ ఉద్యోగిపై చట్టపరమైన చర్యలకు ఉపక్రమించింది కంపెనీ. ఇక సదరు వ్యక్తి నెల జీతం రూ.43 వేలు కాగా.. హెచ్‌ఆర్ చేసిన మిస్టేక్‌తో అతడి ఖాతాలో దాదాపు కోటిన్నర రూపాయలు క్రెడిట్ అయినట్లు సమాచారం. ఈ ఇన్సిడెంట్ మే నెలలో జరగ్గా.. జూన్‌లో లాయర్ ద్వారా రిజిగ్నేషన్ లెటర్ పంపించాడు ఎక్స్ ఎంప్లాయి.