ఉడుకుతున్న సాంబారులో పడిన వ్యక్తి.. ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు

by Nagaya |   ( Updated:2022-08-03 06:05:07.0  )
ఉడుకుతున్న సాంబారులో పడిన వ్యక్తి.. ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు
X

దిశ, వెబ్‌డెస్క్: మద్యం మత్తులో ఓ వ్యక్తి ఒళ్లు తెలియకుండా ప్రవర్తించి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. గ్రామదేవత ఉత్సవాల సందర్భంగా ఊరంతా పండుగ చేసుకుంటుంగా.. ఆ వ్యక్తి మాత్రం ఫుల్‌గా మద్యం తాగి.. ఆ ఇంట్లో తీవ్ర విషాదాన్ని నింపాడు. ఉడుకుతున్న సాంబారులో పడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన తమిళనాడులో జరిగింది.

మధురైలోని పలంగానట్టిలో గ్రామ దేవత ఒడ్డు మారియమ్మ ఉత్సవాలను గ్రామస్తులు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నదానం చేసేందుకు వంటలు చేస్తుండగా గ్రామానికి చెందిన ముత్తుకుమార్ అనే వ్యక్తి ఫుల్‌గా మద్యం తాగి తూలుతూ అక్కడి వచ్చాడు. అన్నదానానికి భారీ పాత్రలో సాంబారు చేస్తుండగా.. గోడ అనుకుని దానిపై కూర్చోబోయి అందులో పడిపోయాడు. వెంటనే గమనించిన గ్రామస్తులు అతడిని కాపాడే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే ముత్తుకుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. ముత్తు కుమార్‌ను రక్షించే క్రమంలో పలువురు గ్రామస్తులు సైతం సాంబారు మీదపడి గాయాలపాలయ్యారు. దీంతో పండుగ రోజు పలంగానట్టి గ్రామంలో విషాదం నెలకొంది.

Advertisement

Next Story

Most Viewed