- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రకృతి ఒడిలో.. శివోహం.. అంగరంగవైభవంగా శివ కళ్యాణం
దిశ, మల్హర్: కాకతీయుల కాలంలో ప్రసిద్ధి గాంచిన శ్రీ మహా లింగేశ్వర పుణ్యక్షేత్రంలో దేవాలయంలో మంగళవారం శివపార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని నిర్వాహకులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం కొయ్యూరు అడవిలోని నైనాగుళ్ళ గుట్టమీద ప్రకృతి వడిలో శివ పార్వతుల కళ్యాణం శివోహం నామస్మరణలతో మారుమోగాయి. నైనాగుళ్ళ చుట్టూ అడవి పక్కనే మానేరు నదితో ప్రకృతి అందాలను తలపిస్తుంది.
కాలినడకన భక్తులు ప్రయాణించడం అంటే శ్రీ మహా లింగేశ్వర పుణ్యక్షేత్రాన్ని దర్శించినట్లుగా భావిస్తున్నారు. నిర్వాహకులు పట్టువస్త్రాలతో శివపార్వతులకు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించిన కళ్యాణ వేడుకలను చూసి తరించేందుకు ఎందరో భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చారు. కళ్యాణానికి పుస్తె, మట్టలు దాతలు స్థానిక సర్పంచ్ సిద్ది లింగమూర్తి, కుంభం మల్లారెడ్డి, నిర్వాహకులు బొమ్మ బాపురెడ్డి, గడ్డం లచ్చయ్యతో పాటు పలువురు పాల్గొన్నారు.