- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆర్థిక బిల్లును ఆమోదించిన లోక్‌సభ
న్యూఢిల్లీ: ఆర్థిక బిల్లును లోక్‌సభ ఆమోదించింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గానూ బడ్జెట్ కసరత్తును పూర్తి చేస్తూ పన్నుల అమలుకు దారితీసే ఆర్థిక బిల్లుకు లోక్‌సభ శుక్రవారం ఆమోదం తెలిపింది. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ దిగువ సభలో ప్రవేశపెట్టిన 39 అధికారిక సవరణలకు సభ ఆమోదం తెలిపింది. అయితే విపక్షాలు ప్రతిపాదించిన సవరణలను మూజువాణీ ఓటు ద్వారా తిరస్కరించారు. ఆర్థిక బిల్లుపై చర్చలో సమాధానమిస్తూ కరోనా మహమ్మారి సమయంలో దెబ్బతిన్నప్పటికీ కొత్త పన్నులు దేశంలో పెంచలేదని చెప్పారు. ఓ నివేదిక ప్రకారం 32 దేశాలు మహమ్మారి తర్వాత పన్నులు పెంచాయని వెల్లడించారు.
తక్కువ పన్నులపై మోడీ ప్రభుత్వం విశ్వాసం ఉంచిందని ఆమె తెలిపారు. అంతేకాకుండా కార్పోరేట్ టాక్స్ లో తగ్గుదల ఆర్థిక వ్యవస్థకు, ప్రభుత్వానికి, కంపెనీలకు సహకారిగా ఉందని అన్నారు. దీంతో పురోగతి కనిపిస్తోందని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు రూ.7.3 లక్షల కోట్ల కార్పొరేట్ పన్ను వసూలు చేసినట్లు ఆమె తెలిపారు. కొన్ని ఏళ్లలోనే 5 కోట్ల నుంచి 9.1 కోట్లకు పన్ను చెల్లింపుదారులు పెరిగారని చెప్పారు. పన్నులపై అవగాహనకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఎగుమతులు చేసే వస్తువులపై పన్నులు పెంచడం పై స్పందిస్తూ, దేశీయ ఉత్పత్తులకు ప్రోత్సాహం ఇవ్వనున్నట్లు చెప్పారు.