- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జీవితంలో ఒక్కసారే.. అయోవా టోర్నడోలో కారుపైన మెరుపు దాడి! (వీడియో)
దిశ, వెబ్‌డెస్క్ః కొన్ని సంఘటనలు జీవితంలో ఒకేసారి కనిపిస్తాయి. ఆ అనుభవం ఒక్కోసారి మాటల్లో కూడా చెప్పలేకపోవచ్చు. ఇలాంటి సంఘటనే అమెరికాలోని మిడ్‌వెస్ట్రన్ స్టేట్ అయోవాలో జరిగింది. సుడిగాలి (టోర్నాడో) మధ్యలో ఆకాశం నుండి దూసుకొచ్చిన ఓ మెరుపు రోడ్డుపై ఉన్న కారును ఢీకొట్టిన సంఘటన అనుకోకుండా కెమేరాకు చిక్కింది. తుఫాను ఛేజర్ అయిన క్రిస్టోఫర్ రిస్కే ఏప్రిల్ 12న అయోవాలోని గిల్మోర్‌లో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, తన స్నేహితుడి టయోటా ప్రియస్ కారును మెరుపు తాకిన దృశ్యాన్ని అతడు రికార్డ్ చేశాడు. యూట్యూబ్‌లో వీడియోను పోస్ట్ చేశాడు, అయితే, లక్కీగా అతడి స్నేహితుడి కారుకు పెద్ద ప్రమాదం జరగకపోవడం, ఇంకా పనిచేస్తునే ఉండటం విశేషం. ఇక, ఈ వీడియోను స్లో మోషన్‌లో చూపించడం వల్ల మెరుపును చూసే అవకాశం దొరుకుతుంది. నెమ్మదిగా ఉన్నప్పటికీ, మెరుపు ఫ్లాష్ సెకను కంటే ఎక్కువసేపు ఉండదు. అయితే, మెరుపు తాకిన వెంటనే కారు కింద స్పార్క్‌లు చాలా స్పష్టంగా కనిపిస్తాయి.
మంగళవారం ఒక్కరోజే అయోవా రాష్ట్రాన్ని చీల్చి చెండాడిన 10 టోర్నడోలలో ఇది ఒకటి. తీవ్రమైన వాతావరణం మధ్య యుఎస్ కొట్టుమిట్టాడగా, దక్షిణ రాష్ట్రమైన టెక్సాస్ నుండి మిడ్‌వెస్ట్‌లోని నెబ్రాస్కా వరకు ఇతర తుఫానులు విజృంభించబోతున్నట్లు అధికారులు ప్రకటించారు.