ఐపీఓలో పీఎంజేజేబీవై పాలసీదారులకు తగ్గింపు ఉండదు: ఎల్ఐసీ స్పష్టత!

by Web Desk |
ఐపీఓలో పీఎంజేజేబీవై పాలసీదారులకు తగ్గింపు ఉండదు: ఎల్ఐసీ స్పష్టత!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ రంగ దిగ్గజ బీమా సంస్థ ఎల్ఐసీ ఐపీఓ లో ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన(పీఎంజేజేబీవై) పాలసీదారులు ధరల డిస్కౌంట్‌కు అర్హులు కాదని సంస్థ మంగళవారం ఓ ప్రత్యేక వివరణను జారీ చేసింది. సోమవారం ఎల్ఐసీ ఛైర్మన్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ పీఎంజేజేబీవై సబ్‌స్క్రైబర్లు కూడా ఎల్ఐసీ ఐపీఓలో డిస్కౌంట్‌కు అర్హులవుతారని చెప్పిన తర్వాత సంస్థ ఈ ప్రకటనను వెలువరించింది.

దీనికి సంబంధించి 'అనుకోకుండా వచ్చిన ప్రస్తావన' అని, పీఎంజేజేబీవై గ్రూప్ ఇన్సూరెన్స్ విభాగంలోకి వస్తుంది కాబట్టి, ఈ పాలసీదారులు ఐపీఓ డిస్కౌంట్‌కు అర్హులు కాదని ఎల్ఐసీ వివరించింది. వేరే ఏదేనీ గ్రూప్ ఇన్సూరెన్స్ తీసుకున్న పాలసీదారులకు కూడా రిజర్వ్ కేటగిరిలో ఐపీఓకు దరఖాస్తు చేసుకోలేరని ఎల్ఐసీ స్పష్టం చేసింది. మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి సమర్పంచిన డ్రాఫ్ట్ ఫైల్‌లో మొత్తం ఎల్ఐసీ 10 శాతం ఎల్ఐసీ పాలసీదారులకు రిజర్వ్ చేయబడింది.

అయితే, ఇటీవల డిస్కౌంట్ కూడా ఉంటుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ అలాంటి రాయితీ లేమీ ఎల్ఐసి తన ప్రణాళికను ప్రకటించలేదు. ఇక, ఎల్ఐసీ పాలసీదారులు తమ పాలసీ రికార్డుల్లో వీలైనంత త్వరగా పాన్ కార్డు వివరాలను ఉప్‌డేట్ చేయాలని సంస్థ మరోసారి తన వినియోగదారులను కోరింది. సెబీకి డ్రాఫ్ట్ ఫైల్ ఇచ్చిన నాటి నుంచి రెండు వారాల్లో(ఈ నెల 28)గా పాన్ వివరాలను అప్‌డేట్ చేయకపోతే వారు ఎల్ఐసీ ఐపీఓకు అర్హులుగా పరిగణించరని సంస్థ వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed