- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎల్ఐసీ ఐపీఓలో పాల్గొనేందుకు పాలసీదారుల పాన్ నంబర్ అప్‌డేట్ తప్పనిసరి!
దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ సంస్థ మార్చిలో ఐపీఓకు రానుంది. ఈ నేపథ్యంలో ఐపీఓలో పాల్గొంచేందుకు పాలసీదారులు వారి పాన్ నంబర్‌ను ఈ నెల 28లోగా అప్‌డేట్ చేయాలని ఎల్ఐసీ కోరింది. గత వారం ఎల్ఐసీ సంస్థ డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్(డీఆర్‌హెచ్‌పీ)ని ఫైల్ చేసింది. దీన్ని దాఖలు చేసిన తేదీ నుంచి రెండు వారాల్లోగా(ఫిబ్రవరి 28 నాటికి) ఎల్ఐసీలో పాలసీదారు పాన్ వివరాలను అప్‌డేట్ చేయకపోతే ఐపీఓలో పాల్గొనేందుకు అర్హత కోల్పోతారని పేర్కొంది.
దీనికోసం నేరుగా లేదంటే ఏజెంట్‌ల సహాయంతో ఎల్ఐసీ వెబ్‌సైట్‌లో పాన్ అప్‌డేషన్ చేయవచ్చు. ఇక, ఎల్ఐసీ పాలసీదారులకు ఐపీఓ లో ఆఫర్ రూపంలో కొంత భాగాన్ని కేటాయించడమే కాకుండా వారికి రాయితీ రూపంలో రిటైల్ ఇన్వెస్టర్ల కంటే తక్కువ ధరకు షేర్లను కేటాయించనున్నట్లు ఎల్ఐసీ వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే, ఎల్ఐసీ ఐపీఓ లో పాల్గొనేందుకు ఎక్కువమంది పాలసీదారులు ఆసక్తి చూపించవచ్చు.
కానీ ఎల్ఐసీ ఫైల్ చేసిన డీఆర్‌హెచ్‌పీ ప్రకారం పాలసీదారులందరికీ ఈ తగ్గింపు ఆఫర్ లభించే అవకాశం లేదు. దీనికి కొన్ని కండీషన్లను పెట్టింది ఎల్ఐసీ సంస్థ. దీని ప్రకారం.. పాలసీదారు, ఆ వ్యక్తి జీవిత భాగస్వామితో కలిపి ఉమ్మడి డీమ్యాట్ అకౌంట్ ఉంటే ఆఫర్ వర్తించదు. సెబీ నిబంధనల ప్రకారం డీమ్యాట్ అకౌంట్ ఉన్న ప్రైమరీ లబ్ధిదారు పేరు మాత్రమే ఉపయోగించడానికి వీలుంటుంది.
అలాగే, ప్రస్తుతం యాన్యూటీ పొందే పాలసీదారు జీవిత భాగస్వామి దరఖాస్తు చేసుకునేందుకు వీలుండదు. అంతేకాకుండా పాలసీదారు పేరుతో మాత్రమే డీమ్యాట్ అకౌంట్ లేకపోతే ఆఫర్ వర్తించదు. ఎన్ఆర్ఐలకు కూడా ఈ ఆఫర్ ఉండదు. ఏదైనా పాలసీకి నామినీగా ఉన్న వ్యక్తి కూడా ఎల్ఐసీ ఐపీఓలో ఆఫర్‌లో షేర్లు లభించవు. గ్రూప్ పాలసీ కాకుండా వేరే ఏ పాలసీల్లో నైనా ఉన్నా ఐపీఓ ఆఫర్ ఉంటుందని ఎల్ఐసీ సంస్థ వెల్లడించింది.