కార్యకర్తలే పార్టీకి వెన్నెముక్క.. కార్యకర్తలకు అండగా పార్టీ: టీఆర్ఎస్

by Javid Pasha |
కార్యకర్తలే పార్టీకి వెన్నెముక్క.. కార్యకర్తలకు అండగా పార్టీ: టీఆర్ఎస్
X

దిశ, అమీన్ పూర్: టీఅర్ఎస్ పార్టీకి కార్యకర్తలే వెన్నెముక అని పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఇందులో భాగంగానే పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం వారికి ప్రమాద బీమా చేయించి, ప్రమాదవశాత్తు మృతి చెందితే రెండు లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందిస్తున్న ఏకైక పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని ఆయన చెప్పారు. పటాన్ చెరు నియోజకవర్గంలోని జిన్నారం మండలం కిష్టయ్య పల్లి గ్రామానికి చెందిన కొడకంచి రామకృష్ణ, బొల్లారం మున్సిపాలిటీ బి.సి కాలనీకి చెందిన సత్యనారాయణలు టీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలక కార్యకర్తగా పని చేస్తు ఇటీవల వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. టీఆర్ఎస్ పార్టీ బీమా సౌకర్యం కలిగి ఉండడంతో ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయల ప్రమాద బీమా మంజూరైంది.

ఈ మేరకు శనివారం పటాన్ చెరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే కార్యకర్తల కుటుంబాలకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి భీమా సౌకర్యం అందించడం జరిగిందన్నారు. పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసే కార్యకర్తలకు అండగా ఉండే ఏకైక పార్టీ టీఆర్ఎస్ మాత్రమేనన్నారు. కార్యకర్తల సమిష్టి కృషితోనే నేడు టీఆర్ఎస్ పార్టీ రెండుసార్లు అధికారం చేపట్టిందని అన్నారు. పార్టీ అధిష్టానం రాష్ట్రవ్యాప్తంగా 60 లక్షల మంది కార్యకర్తలకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బొల్లారం మున్సిపల్ కౌన్సిలర్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు చంద్రారెడ్డి, రెండో వార్డు కౌన్సిలర్ గోపాలమ్మ, నరసింహ, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story