BB Telugu 8: విన్నర్ ఎవరు..? గత సీజన్ ఎఫెక్ట్.. ఏకంగా ఎన్ని సీసీ కెమెరాలు అమర్చనున్నారో తెలుసా..?

by Anjali |
BB Telugu 8: విన్నర్ ఎవరు..? గత సీజన్ ఎఫెక్ట్.. ఏకంగా ఎన్ని సీసీ కెమెరాలు అమర్చనున్నారో తెలుసా..?
X

దిశ, వెబ్‌డెస్క్: నాగర్జున(Nagarjuna) హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న తెలుగు బిగ్‌బాస్ సీజన్-8 (BB Telugu 8) మరో రెండ్రోజుల్లో పూర్తి అవ్వబోతుంది. ఆదివారం (డిసెంబరు 15) గ్రాండ్ ఫినాలే నిర్వహించబోతున్నారు. అలాగే ఈ ఈవెంట్‌కు ఓ ప్రముఖ సెలబ్రిటీ రాబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆయన చేతుల మీదుగానే ఈ సీజన్ విన్నర్‌ ట్రోఫీ అందుకోబోనున్నారట. ప్రస్తుతం గౌతమ్(Gautam), నిఖిల్(Nikhil), ప్రేరణ(Prerana), నబీల్(Nabeel), అవినాష్(Avinash) టైటిల్ రేస్‌లో ఉన్నారు. ఎవరూ కప్పు కొట్టానున్నారోనని బిగ్‌బాస్ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

చాలా వరకు గౌతమ్ లేదా నిఖిల్ ఇద్దరిట్లో ఎవరో ఒకరు టైటిల్ విన్నర్ అవుతారని భావిస్తున్నారు. అయితే గత సీజన్‌లో పల్లవి ప్రశాంత్ కప్పు గెలుచుకుని బయటకెళ్లే సమయంలో ఎంత పెద్ద రచ్చ జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. కాగా ఇప్పుడు విన్నర్ కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon star Allu Arjun) చేతుల మీదుగా కప్పు ఇవ్వబోతున్నారట. కాగా గత సీజన్‌లో జరిగిన పరిణామాలు దృష్టిలో పెట్టుకుని.. ఈసారి ఎలాంటి గొడవలు చోటుచేసుకోకుండా అన్నపూర్ణ స్టూడియో(Annapurna studio) చూట్టూ దాదాపు 53 సీసీ కెమెరాలతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయనున్నారట. 14 వ తేదీన మార్నింగే సీసీ కెమెరాలను అమర్చాలని పోలీసులు సూచించారట.

👉 Download Dishadaily Android App
👉 Download Dishadaily IOS App
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story

Most Viewed