అందులోని భూ సమస్యలు పరిష్కరించాలి: సీపీఎం

by Javid Pasha |
అందులోని భూ సమస్యలు పరిష్కరించాలి: సీపీఎం
X

దిశ, కోడేర్ : ధరణి వెబ్సైట్ లో తప్పులను సరిచేసి రైతుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్ధన్ పర్వతాలు డిమాండ్ చేశారు. కోడేరు సిపిఎం పార్టీ మండల కమిటీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధరణి లో ఒకరి భూములు మరొకరికి నమోదు కావడంతో వాస్తవ రైతులకు రైతుబంధు పథకం పోవడమేకాక మరొకరికి పోవడంతో వాస్తవ రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. మంత్రివర్గ ఉపసంఘం చేసిన సిఫార్సులను అమలు చేయడంలో ప్రభుత్వం తాత్సారం చేస్తోందని ఆరోపించారు.

కోడేరు మండలం లో కేఎల్ఐ కాలువల ద్వారా వచ్చే నీటిని అర్ధంతరంగా నిలుపుదల చేయడంతో సింగయిపల్లి, రాజాపూర్ తదితర గ్రామాల రైతులు పంటలు ఎండిపోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల్లో ఇళ్ల స్థలాలు లేని ప్రతి ఒక్కరిని గ్రామసభల ద్వారా సర్వే చేయించి లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, సొంత ఇంటిలో ఇల్లు నిర్మించుటకు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్.శ్రీనివాసులు,జిల్లా కమిటీ సభ్యుడు ఎం శ్రీనివాసులు, మండల కార్యదర్శి పి.నరసింహ,మండల కమిటీ సభ్యులు వెంకటమ్మ, ఈశ్వర్, ఎండి. మాలిక్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed