Krithi Shetty: 'నాకు బాయ్‌ఫ్రెండ్ కావాలంటోన్న' బేబమ్మ

by Manoj |   ( Updated:2022-07-09 07:23:34.0  )
Krithi Shetty Needs a boyfriend, Posts On Twitter
X

దిశ, వెబ్‌డెస్క్: Krithi Shetty Needs a boyfriend, Posts On Twitter| టాలీవుడ్ హీరోయిన్ కృతి శెట్టి 'ఉప్పెన' సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంతోనే తనదైన నటన, అందంతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ ఒక్కసారిగా ఇండస్ట్రీని తనవైపు తిప్పుకుంది. కృతిశెట్టి వరుస సినిమాల్లో నటించి తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ప్రస్తుతం ఎనర్జిటిక్ హీరో రామ్‌ సరసన 'ది వారియర్' మూవీతో ప్రేక్షకులను మరోసారి అలరించడానికి రెడీ అయింది.

ఈ నేపథ్యంలో తన సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర పోస్ట్ చేసింది. ''నాకు ఓ బాయ్‌ఫ్రెండ్ కావాలి. అందమైన అబ్బాయిలను ట్యాగ్ చేయండి''. అంటూ సిగ్గుపడుతూ అంటోంది ఈ భామ. అది చూసిన నెటిజన్లు ఖుషీ అవుతూ.. రకరకాల కామెంట్లు లైక్స్‌తో సోషల్ మీడియాలో తెగ రచ్చ చేస్తున్నారు.

Advertisement

Next Story