టీఆర్ఎస్ రాజ్యసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా సురేష్ రెడ్డి

by Javid Pasha |   ( Updated:2022-03-29 13:41:59.0  )
టీఆర్ఎస్ రాజ్యసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా సురేష్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేష్ రెడ్డి డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా ఎన్నికయ్యారు. మంగళవారం నియామక ఉత్తర్వులను టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ ప్లోర్ లీడర్ కే. కేశవరావు జారీ చేశారు. సురేష్ రెడ్డిన ఫ్లోర్ లీడర్‌గా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఆదేశాల మేరకు నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులు వెంటనే అమలులోకి వస్తాయని కేకే తెలిపారు. నిజామాబాద్ జిల్లా చౌట్ పల్లికి చెందిన సురేష్ రెడ్డి 1984లో మండల స్థాయి రాజకీయాల్లోకి వచ్చారు. బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 1989 నుంచి 2004 ఎన్నికల వరకు నాలుగు సార్లు వరుసగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికయ్యారు.

2004లో 12వ శాసనసభకు స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో, 1990 నుండి 1993 వరకు అసెంబ్లీ లైబ్రరీ కమిటీ ఛైర్మన్‌గా ఉన్నాడు. 1997లో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్‌గా ఎన్నికయ్యాడు. 2000-2003 వరకు కాంగ్రెస్ పార్టీ విప్‌గా కూడా పనిచేశాడు. 2018లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరారు. 2020లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు.

Advertisement

Next Story

Most Viewed