- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Konda Vishweshwar Reddy: బీజేపీలోకి కొండా విశ్వేశ్వర్ రెడ్డి.. ముహూర్తం ఫిక్స్?
దిశ, వెబ్‌డెస్క్: Konda Vishweshwar Reddy to be Joined in BJP| మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కమలం గూటికి చేరేందుకు మూహుర్తం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలు సందర్భాల్లో బీజేపీ పెద్దలతో చర్చలు జరిపిన ఆయన.. రేపు లేదా ఎల్లుండి బీజేపీ కండువా కప్పుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ రెండు రోజులు కుదరని పక్షంలో జులై 3న సికింద్రాబాద్ లో జరగనున్న భారీ బహిరంగ సభలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో కాషాయ తీర్ధం పుచ్చుకునేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ను వీడిన తర్వాత కొండా బీజేపీలో చేరుతారనే ప్రచారం చాలా కాలంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో కొండా రహస్యంగా భేటీ అయి పార్టీలో చేరికపై తుది నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిణామాల దృష్ట్యా బీజేపీలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నట్లు సమాచారం.
అయితే ఆషాడం మాసం ప్రారంభం కావడంతో ఆయన చేరికపై కొంతవరకు సెంటిమెంట్ అడ్డుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మోడీ సభకు ముందే చేరుతారా? లేక ఆషాడం ముగిశాక పార్టీ తీర్థం పుచ్చుకుంటారా? అనేది సస్పెన్స్ గా మారింది. ఇప్పటికే పలు దఫాలుగా పార్టీ పెద్దలతో చర్చలు జరిపిన కొండావిశ్వేశ్వర్ రెడ్డి బీజేపీ గూటికి చేరడం దాదాపుగా ఖాయం అని తెలుస్తోంది. అయితే కొండా వెంట ఎవరెవరు బీజేపీలోకి వెళ్లనున్నారనేది ఆసక్తిని రేపుతోంది.