- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
Kona Venkat : ఆలాంటి సినిమాలు ఎప్పటికీ బ్లాక్ బస్టర్ అవ్వలేవు అంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేసిన కోన వెంకట్
దిశ, వెబ్ డెస్క్ : ప్రముఖ టాలీవుడ్ రైటర్ కోన వెంకట్ ( Kona Venkat ) ఇప్పటికి ఎన్నో సినిమాలకి రచయితగా పని చేశారు. ఆయన రైటర్ గా వర్క్ చేసిన సినిమాలలో చాలా వరకు మంచి విజయం సాధించాయి. అయితే, ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఆయన కొన్ని సినిమాలకు కథ ఎంత మంచిగున్నా బ్లాక్ బస్టర్ కొట్టలేవని షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఇక ఆయన మాట్లాడుతూ.. " ఏదైనా సినిమా గొప్పగా పేరు సంపాదించాలంటే.. దానిలో ఎమోషన్ ఉండాలి. ఆ ఎమోషన్ ఏదైనా పర్వాలేదు .. అన్న , చెల్లి , అమ్మ , నాన్న … ఇలా ఏదో ఒక ఎమోషన్ ఉండాలి. ఇలాంటి ఎమోషన్ ఉన్న సినిమాలు ప్రేక్షకులను థియేటర్లలో రెండు గంటలు సీట్లల్లో కూర్చోబెడతాయి. కనీసం ఒక్క సీన్ అయినా మనసును కదిలించేలా ఉండాలని" అన్నారు.
అలా లేని సినిమాలు హిట్ అవుతాయమో కానీ, బ్లాక్ బస్టర్ మాత్రం ఎప్పటికీ అవ్వలేవని షాకింగ్ కామెంట్స్ చేశారు. హిట్ కి బ్లాక్ బస్టర్ కి తేడా ఎమోషన్. అది లేకపోతే ఆ మూవీ ఎవ్వరికీ గుర్తుండదు. ఎమోషన్ తో హిట్ అయిన సినిమాను ఎవ్వరూ మర్చిపోరంటూ కోన వెంకట్ తెలిపారు.