Komatireddy Rajagopal Reddy: కోమటిరెడ్డి వ్యవహారంలో మరో ట్విస్ట్.. ఢిల్లీ నుంచి ఎమ్మెల్యేకు పిలుపు

by GSrikanth |   ( Updated:2022-07-28 11:31:20.0  )
Komatireddy Rajagopal Reddy invited to Delhi from Congress High Command
X

దిశ, తెలంగాణ బ్యూరో: Komatireddy Rajagopal Reddy invited to Delhi from Congress High Command| మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. ఆయనపై వేటేస్తారని కాంగ్రెస్ నేతలు ఉత్కంఠంగా చూస్తున్న నేపథ్యంలో ఢిల్లీకి రావాలంటూ ఏఐసీసీ నుంచి సమాచారమిచ్చారు. దీంతో రెండ్రుజుల్లో ఆయన ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది. అధిష్టానంపై వ్యతిరేక స్వరం పెంచిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారని గాంధీభవన్ వర్గాలు భావించాయి. దానికితోడుగా ఆయన బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు కూడా అటు బీజేపీ స్టేట్ చీఫ్ సంజయ్ కూడా ప్రకటించారు. త్వరలోనే ఆయన పార్టీ మారడం ఖాయమనే విషయం తెలిసిందే. బీజేపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డిని బుజ్జగించే ప్రయత్నాల్లో కాంగ్రెస్ నేతలున్నారు. పార్టీ మార్పుపై రెండు రోజుల నుంచి సెగ్మెంట్‌లోని వివిధ మండలాల నేతలు, అనుచరులతో వరుసగా సమావేశమవుతున్నారు.

ఈ నేపథ్యంలో సస్పెన్షన్‌పై కాంగ్రెస్ హైకమాండ్‌ ఎటూ తేల్చలేదు. రాజగోపాల్‌రెడ్డిని పార్టీ నుంచి బహిష్కరించేందుకు కాంగ్రెస్‌ అధిష్ఠానం రంగం సిద్ధచేస్తోందని ప్రచారం జరిగింది. ఇంతలోనే హైకమాండ్ నుంచి బుజ్జగింపుల పర్వం మొదలైంది. ఒక్కసారిగా ప్రచారం తిరుగబడింది. ఇప్పటికే ఈ అంశంపై ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్‌తో రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్‌తో పాటుగా పలువురు బుధవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి పార్టీని వీడే అవకాశం లేదంటూ భట్టి ప్రకటించారు. ఈ పరిణామాలు సాగుతుండగానే.. ఏఐసీసీ నుంచి రాజగోపాల్ రెడ్డికి పిలుపు వచ్చింది. సాధ్యమైనంత మేరకు ఆయనను పార్టీలోనే కొనసాగించేందుకు ఒప్పించాలని, ఈ బాధ్యతలను ఎంపీ ఉత్తమ్ భుజాలపై వేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఉత్తమ్ నుంచి కూడా రాజగోపాల్ రెడ్డి బుజ్జగింపులు మొదలయ్యాయి. మొత్తంగా రాజగోపాల్​ రెడ్డిపై వేటు వేయడం కాకుండా.. బుజ్జగింపులపర్వం సాగుతుండటంతో.. పార్టీ సీనియర్లలోనూ ఒకింత ఆగ్రహం వ్యక్తమవుతోంది.

ఇది కూడా చదవండి: రాజగోపాల్ రెడ్డి అంశంలో కేసీఆర్ ప్లాన్- బీ?

Advertisement

Next Story

Most Viewed