- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Andhra News : సీఎం నిర్ణయమే శిరోధార్యం 24 మంది మంత్రులు రాజీనామా: ఎమ్మెల్యే కొడాలి నాని
దిశ, ఏపీ బ్యూరో: మంత్రి పదవికి రాజీనామా చేసిన అనంతరం కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. కేబినెట్ భేటీ అనంతరం సీఎం జగన్ రాజీనామాలు చేయాలని ఆదేశించారని దీంతో అందరం రాజీనామాలు చేసినట్లు వెల్లడించారు. మంత్రి మండలి లో ఉన్న 24 మంది రాజీనామాలు చేసినట్లు తెలిపారు. అయితే కొందరు సీనియర్లు తనతోపాటు కొనసాగుతారని జగన్ చెప్పారని కొడాలి నాని తెలిపారు. అనుభవం రీత్యా, కుల సమీకరణాల నేపథ్యంలో ఐదుగురు మంత్రులు కేబినెట్‌లో కొనసాగే అవకాశం ఉందన్నారు. కొడాలి నాని మంత్రివర్గంలో ఉంటారా ఉండరా అనేది అప్రస్తుతం అని చెప్పుకొచ్చారు. కొడాలి నానికి కొమ్ములు ఏమీ లేవని చెప్పుకొచ్చారు. మంత్రివర్గంలో తాను కొనసాగే అవకాశం చాలా తక్కువ అని చెప్పుకొచ్చారు.
కొంతమంది సమర్థవంతమైన నేతలు కావాలని ఈ నేపథ్యంలో సామాజిక సమీకరణాల నేపథ్యంలో మంత్రివర్గం కూర్పు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రి పదవులు కోల్పోయిన వారికి పార్టీ బాధ్యతలు అప్పగిస్తానని సీఎం జగన్ వెల్లడించినట్లు కొడాలి నాని చెప్పుకొచ్చారు. తనకు పార్టీ పదవి ఇచ్చినా ఎలాంటి బాధ్యతలు అప్పగించినా చిత్తశుద్ధితో చేస్తానని క్లారిటీ ఇచ్చారు. పార్టీలో ఎవరిని ఎలా ఉపయోగించుకోవాలో కేవలం సీఎం జగన్‌కు మాత్రమే తెలుసునని.. అది ఈనెల 11న స్పష్టమవుతుందని చెప్పుకొచ్చారు. మంత్రి పదవులు పోయినందుకు ఎవరూ బాధపడటం లేదని సీఎం జగన్ మాత్రం బాధపడ్డారని చెప్పుకొచ్చారు. అయితే తామంతా సంతోషంగా ఉన్నామని ఎలాంటి బాధ పెట్టుకోవద్దని సీఎంకు చెప్పినట్లు కొడాలి నాని వెల్లడించారు. అందరం హర్ష ధ్వానాల మధ్యే రాజీనామా చేశామని కొడాలి నాని వెల్లడించారు. ఇకపోతే జగన్ కేబినెట్‌లో కొనసాగే ఐదుగురు మంత్రులు ఎవరా అనేదానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఎవరిని సీఎం జగన్ కొనసాగిస్తారా అంటూ చర్చ హాట్ హాట్‌గా సాగుతుంది.