- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
గ్యాస్ పేల్చి అందరిని చంపుతానన్న కొడుకు.. తండ్రి చేతిలో..

X
దిశ, ముషీరాబాద్ : తండ్రి చేతిలో కొడుకు మృతి చెందిన సంఘటన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. చిక్కడపల్లి సీఐ సంజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం దోమలగూడకు చెందిన రాములు కుమారుడు అనిల్ కుమార్ ( 34 ) డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. తండ్రి రాములు డ్రైవర్గా పని చేస్తున్నాడు. అనిల్ కుమార్ తరుచూ మద్యం తాగి కుటుంబ సభ్యులతో గొడవ పడేవాడు. కాగా బుధవారం రాత్రి కూడా నాకు 10 లక్షలు ఇవ్వాలని తాను వ్యాపారం చేస్తానని తనకు ఖర్చులు ఉన్నాయని ఇంట్లో వారిని అడిగాడు. ఈ విషయం పై గొడవకు దిగిన అనిల్ కుమార్ సిలిండర్ పేల్చి కుటుంబ సభ్యులను చంపేస్తానని బెదిరించాడు. దీంతో ఆత్మ రక్షణ కోసం తండ్రి రాములు కొడకును ఆపే క్రమంలో సుత్తితో అనిల్ నుదుటి పై కొట్టాడు. దీంతో అనిల్ అక్కడికక్కడే మృతిచెందాడు. తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Next Story