అతనితో డేటింగ్.. అప్పటిదాకా ఆగాల్సిందే : నటి

by Manoj |
అతనితో డేటింగ్.. అప్పటిదాకా ఆగాల్సిందే : నటి
X

దిశ, సినిమా : 'అనుపమ' డైలీ సీరియల్‌ ఫేమ్ అనేరి వజాని.. 'ఖత్రోన్ కే ఖిలాడీ' సీజన్ 12లో తన అడ్వెంచరస్ ఫీట్స్ చూపించేందుకు సిద్ధమైంది. ఈ స్టంట్ రియాలిటీ షో కోసం ప్రస్తుతం తను దక్షిణాఫ్రికాలో ఉండగా.. డేర్‌డెవిల్ విన్యాసాలు చేయడం, భయాందోళనలను అధిగమించడం గురించి మీడియాతో షేర్ చేసుకుంది. అంతేకాదు మొదటిసారి ఫ్యామిలీకి దూరంగా ఉంటున్న తను ఒంటరితనంతో బాధపడుతున్నట్లు చెప్తోంది.

రోజంతా కంటెస్టెంట్స్‌తో ఉన్నప్పటికీ రాత్రిపూట గదిలో సింగిల్‌గా ఉండటం తనకు కొత్తని, ఇప్పుడిప్పుడే అలవాటు చేసుకుంటున్నానని చెప్పుకొచ్చింది. ఇక తను దక్షిణాఫ్రికాకు బయలుదేరుతున్నప్పుడు సెండాఫ్ ఇచ్చేందుకు వచ్చిన ఆమె క్లోజ్ ఫ్రెండ్ హర్ష్ రాజ్‌పుత్‌‌ హర్ష్‌‌తో డేటింగ్ రూమర్స్ వ్యాపించగా.. తాను ఫోకస్ మొత్తం కెరీర్‌పైనే అని వెల్లడించింది. టైమ్ వచ్చినప్పుడు రిలేషన్ లేదా మ్యారేజ్ గురించి తెలియజేస్తానని పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed